'ఎయిర్‌లిఫ్ట్‌' దుమ్ములేపుతోంది! | Airlift beats KyaaKoolHainHum3 with huge collections | Sakshi
Sakshi News home page

'ఎయిర్‌లిఫ్ట్‌' దుమ్ములేపుతోంది!

Jan 24 2016 5:12 PM | Updated on Sep 3 2017 4:15 PM

'ఎయిర్‌లిఫ్ట్‌' దుమ్ములేపుతోంది!

'ఎయిర్‌లిఫ్ట్‌' దుమ్ములేపుతోంది!

రాజాకృష్ణ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా వార్ థ్రిల్లర్ 'ఎయిర్‌లిఫ్ట్‌' చిత్రం బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతోంది.

ముంబై: రాజాకృష్ణ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా వార్ థ్రిల్లర్ 'ఎయిర్‌లిఫ్ట్‌' చిత్రం బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతోంది. అక్షయ్‌కుమార్, నిమ్రత్‌కౌర్ జంటగా నటించిన ఈ సినిమా తొలిరోజే సూపర్‌హిట్ టాక్‌ సంపాదించుకుంది. అయితే ఈ సినిమాకు తొలిరోజు అడల్ట్‌ కామెడీ 'క్యా కూల్ హై హమ్‌ 3' నుంచి గట్టిపోటీ ఎదుర్కొంది. దీంతో తొలిరోజు రూ. 11 కోట్లు వసూలు చేసిన 'ఎయిర్‌లిఫ్ట్‌' రెండో రోజు మాత్రం గణనీయంగా పుంజుకుంది. రెండోరోజూ ఈ సినిమా ఏకంగా రూ. 14 కోట్లు వసూలు చేసింది. అదే సమయంలో నెగిటివ్ టాక్ సంపాదించుకున్న 'క్యా కూల్ హై హమ్‌ 3' కలెక్షన్స్ రెండోరోజు గణనీయంగా పడిపోయాయి. మొత్తంగా భారీ కలెక్షన్లతో యాక్షన్ స్టార్ అక్షయ్‌కుమార్ 'ఎయిర్‌లిఫ్ట్' దూసుకుపోతున్నది. ఈ సినిమా తొలి రెండురోజుల్లో రూ. 25.5 కోట్లు వసూలు చేసింది.

1990లో కువైట్‌పై ఇరాక్‌ దురాక్రమణ చేసిన సందర్భంలో అక్కడ చిక్కుకుపోయిన 1.70 లక్షలమంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించే కథాంశంతో 'ఎయిర్‌లిఫ్ట్' సినిమా తెరకెక్కింది. అక్షయ్‌కుమార్ తన కెరీర్‌లో ఉత్తమ అభినయాన్ని ఈ సినిమాలో చూపించారని విమర్శకుల ప్రశంసలందుకుంటున్నారు. ఈ సినిమాలో ఆయన పోషించిన భారత సంతతి వ్యాపారవేత్త రంజిత్ పాత్ర అభిమానులను అలరిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement