23 ఏళ్ల తరువాత కూడా అదే మ్యాజిక్‌ : అల్లు అర్జున్‌ | After 23 Years Allu Arjun Felt The Same Magic Of DDL | Sakshi
Sakshi News home page

Nov 27 2018 1:21 PM | Updated on Nov 27 2018 3:47 PM

After 23 Yeras Allu Arjun Felt The Same Magic Of DDL - Sakshi

బాలీవుడ్ క్లాసిక్‌ దిల్ వాలే దుల్మానియా లేజాయేంగే సినిమా నచ్చని వారంటూ ఉండరు. ముఖ్యంగా ఆ సినిమాలో పాటలు ఎవర్‌గ్రీన్‌ క్లాసిక్స్‌గా నిలిచిపోయాయి. అందుకే ఆ సినిమా భారతీయ సినీ అభిమానులకు మోస్ట్ ఫేవరెట్‌. టాలీవుడ్ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కూడా అందుకు మినహాయింపేమి కాదు.  తాజాగా ఈ సినిమాకు సంబందించి బన్నీ పెట్టిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. సోమవారం రాత్రి డీడీఎల్‌ సినిమా చూసిన బన్నీ స్క్రీన్‌ షాట్‌ తో పాటు ఆసక్తికర కామెంట్ చేశాడు.

‘1995లో తొలిసారిగా ఈ సినిమాలో తుజే దేఖాతో యే జానా సనమ్‌ పాటు చూసినప్పుడు నా జీవితంలో హైయ్యస్ట్ మ్యాజిక్‌ ఫీల్‌ అయ్యాను. ఇప్పుడు 23 ఏళ్ల తరువాత ఆ పాట మళ్లీ చూశాను. ఇప్పుడు కూడా అదే మ్యాజిక్‌ ఫీల్‌ అయ్యాను. నా జీవితంలోనే హైయ్యస్ట్ సినిమాటిక్‌ మూమెంట్‌. ఎప్పటికీ’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు బన్నీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement