అందరూ నిర్మాతలే

Adivi Saikiran's 'Operation Gold Fish' shoot almost completed - Sakshi

ఆది సాయికుమార్, నిత్యా నరేశ్, పార్వతీశం, శషా చెట్రి ముఖ్య తారలుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌’. ‘వినాయకుడు, కేరింత’ వంటి సినిమాలు తెరకెక్కించిన అడవి సాయికిరణ్‌ దర్శకుడు. ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణులే ఈ చిత్రం నిర్మించడం విశేషం. ఎయిర్‌టెల్‌ మోడల్‌ శషా చెట్రి ఈ చిత్రంతో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయం అవుతున్నారు. మాటలు రచయిత అబ్బూరి రవి ప్రతినాయకుడి పాత్ర చేస్తున్నారు. ‘‘వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రమిది. షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. కాశ్మీర్, ఢిల్లీ, లంబసింగి, చింతపల్లి తదితర ప్రాంతాల్లో షూటింగ్‌ చేస్తున్నాం. ఒక్క షెడ్యూల్‌ మినహా చిత్రీకరణ పూర్తయింది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా మా సినిమా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top