హిజ్రా పాత్రలో హీరోయిన్‌

Adah Sharma Plays Hijra Role In Tamil Movie - Sakshi

నితిన్‌, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన భామ ఆదాశర్మ. గ్లామర్‌తో ఆకట్టుకున్న అదాశర్మ అవకాశాలను అందిపుచ్చుకోవటంతో మాత్రం ఫెయిల్ అయ్యారు. క్షణం, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి హిట్ సినిమాలో నటించినా.. ఆ సక్సెస్‌ కెరీర్‌కు ఏ మాత్రం ఉపయోగపడలేదు.

దీంతో బాలీవుడ్ మీద దృష్టి పెట్టిన అదా శర్మ అక్కడ కూడా స్టార్‌ స్టేటస్ అందుకోలేకపోయారు. తాజాగా ఈ భామ ఓ చాలెంజింగ్‌ రోల్‌కు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. అబీర్‌ సేన్‌ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ సినిమా ‘మేన్‌ టు మేన్‌’లో అదా హిజ్రా పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటి వరకు హిజ్రా పాత్రల్లో మేల్‌ ఆర్టిస్ట్‌లు మాత్రమే కనిపించారు. తొలిసారిగా ఓ నటి హిజ్రా పాత్రలో నటిస్తుండటంతో ‘మేన్‌ టు మేన్‌’ సినిమా కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top