నాకింకా పెళ్లీడు రాలేదు | Actress Hansika Motwani Exclusive Interview | Sakshi
Sakshi News home page

నాకింకా పెళ్లీడు రాలేదు

Oct 27 2016 1:48 AM | Updated on Sep 4 2017 6:23 PM

నాకింకా పెళ్లీడు రాలేదు

నాకింకా పెళ్లీడు రాలేదు

నా జీవితంలో ప్రేమ వచ్చి పోయిందని నటి హన్సిక నిర్లిప్తను వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమలో దర్శకుల నటిగా పేరు తెచ్చుకున్న

నా జీవితంలో ప్రేమ వచ్చి పోయిందని నటి హన్సిక నిర్లిప్తను వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమలో దర్శకుల నటిగా పేరు తెచ్చుకున్న ఈ బబ్లిగర్ల్ కెరీర్ మంచి హైప్‌లో ఉన్న సమయంలో కొన్ని తప్పటడుగులు వేశానని చెప్పవచ్చు. ముఖ్యంగా నటుడు శింబుతో ప్రేమ వ్యవహారం పెద్ద సంచలనానికే దారి తీసింది. ప్రస్తుతం కోలీవుడ్‌లో జయంరవికి జంటగా నటిస్తున్న బోగన్ చిత్రం మినహా మరో అవకాశం రాలేదు. బోగన్ చిత్రం కూడా త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. సో మరో అవకాశం వచ్చే వరకూ హన్సిక పేరు కోలీవుడ్‌లో వినిపించకపోవచ్చు. ప్రస్తుతం ఈ బ్యూటీ తన దత్త పిల్లలతో దీపావళిని జరుపుకోవడానికి ప్లాన్ చేసే పనిలో ఉన్నారట.

దీని గురించి తను ఒక భేటీలో చెబుతూ తానీసారి దీపావళి పండగను తన 31 మంది దత్త పిల్లలతో గడపాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. అందుకోసం ముంబైలో ఒక మండపాన్ని అద్దెకు తీసుకున్నట్లు తెలిపారు. పిల్లల్ని అక్కడికి తీసుకెళ్లి, చుట్టు పక్కల షాపింగ్ వీధుల్లో తిరిగి వారితో కలిసి భోజనం చేసి ఆ రోజంతా పిల్లలతోనే గడపాలని నిర్ణయించుకున్నానన్నారు. పిల్లల సంతోషాన్ని దగ్గరగా చూడాలనే ఈ ఏర్పాటు అని వివరించారు. ఈ సందర్భంగా విలేకరుల ప్రశ్నలకు హన్సిక  ఇచ్చిన బదులేమిటో చూద్దాం.
 
ప్ర:  మీ సహ నటీమణుల్లో కొందరు వివాహం చేసుకున్నారు. మరి కొందరు అందుకు సిద్ధం అవుతున్నారు. మీరెప్పుడు పెళ్లి చేసుకుంటారు?
జ : నేనింకా చాలా చిన్న పిల్లనండీ. నాకింకా పెళ్లీడు రాలేదు. అందుకే అలాంటి ఆలోచన లేదు. మరో ఐదేళ్ల తరువాత పెళ్లి చేసుకుంటాను.
 
ప్ర: మీది ప్రేమ వివాహం అవుతుందా? పెద్దలు నిశ్చయించిన పెళ్లి చేసుకుంటారా?
జ : ప్రేమ అన్నది ఒక అందమైన అనుభవం. అంది అందరికీ కావాలి. అయితే అలాంటి ప్రేమ నా జీవితంలోకి వచ్చి వెళ్లిపోయింది. మా అమ్మ చూసి నిశ్చియించిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను.
 
ప్ర: హీరోలెవరైనా మిమ్మల్ని సహోదరి అని పిలిచారా?
జ: లేదు.అలా నన్నెవరూ పిలవలేదు. ఇంకా చెప్పాలంటే హీరోహీరోయిన్లు అన్నా చెల్లెలుగా మసలు కుంటే నటించే ప్రేమ సన్నివేశాలు పండవు.
 
ప్ర: సరే ఏ హీరో భార్యతోనైనా మీకు స్నేహం ఉందా?
జ: నటుడు జయంరవి భార్య ఆర్తీ నాకు మంచి నెచ్చెలి. తను అంటే నాకు చాలా ఇష్టం. మా మధ్య మంచి స్నేహం ఉంది.
 
ప్ర: తమిళంలో చాలా చిత్రాలు చేశారు. అయినా తమిళ భాషను మట్లాడలేకపోతున్నారే?
జ : నిజానికి నాకు తమిళ భాష కొంచెం తెలుసు. అయితే మాట్లాడేటప్పుడు తప్పులు దొర్లితే అర్థాలు మారిపోతాయనే భయంతో మాట్లాడడం లేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement