ఆ ఇద్దరూ యువతరానికి మంచి ఉదాహరణ

Actor Suriya's speech at Thaanaa Serndha Koottam press meet - Sakshi

‘‘నా స్కూల్, కాలేజ్‌ డేస్‌లో తమ్ముడు (కార్తీ), నేను బస్‌లోనే ప్రయాణం చేసేవాళ్లం. అమ్మానాన్న మమ్మల్ని సింపుల్‌గా పెంచారు. అందుకే మాకు విలువలు తెలుసు. ‘గ్యాంగ్‌’ చేస్తున్నప్పుడు నా చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి’’ అన్నారు సూర్య. విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో సూర్య, కీర్తీ సురేష్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘తానా సేంద కూట్టమ్‌’. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌ పై వంశీ, ప్రమోద్‌ తెలుగులో ‘గ్యాంగ్‌’గా ఈ నెల  12న రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరో సూర్య విలేకరులతో పలు విశేషాలు పంచుకున్నారు.

► ‘గ్యాంగ్‌’ ఒప్పుకోవటానికి ప్రధాన కారణం దర్శకుడు విఘ్నేష్‌. అతను కేవలం డైరెక్టర్‌ మాత్రమే కాదు లిరిసిస్ట్, డ్రమ్మర్‌. సీన్లు రాయటం, యాక్టర్స్‌ నుంచి ఫెర్ఫామెన్స్‌ రాబట్టుకోవడంలో కూడా అతని స్టైల్‌ చాలా కొత్తగా ఉంటుంది.  కెరీర్‌ బిగినింగ్‌ డేస్‌లో చేశాను ఇలాంటి పాత్రలను. నా డైలాగ్‌ డెలివరీ దగ్గరి నుంచి నా క్యారెక్టర్‌ వరకు అంతా ఫ్రెష్‌గా  ఉంటుంది.

► ఇది ‘స్పెషల్‌ 26’ సినిమాకు రీమేక్‌ అయినా కూడా విఘ్నేష్‌ శివన్‌ ఎమోషన్స్, క్యారెక్టర్స్‌ అన్నిటికీ తనదైన టచ్‌ ఇచ్చారు. రెండు, మూడు సీక్వెన్స్‌లు కామన్‌గా ఉండొచ్చు. అంతే.. పూర్తి స్థాయిలో మార్పులు చేశారు.  ఈ సినిమాను ఓ కొత్త చిత్రంగా మలిచారు.  అనిరు«ద్‌ మంచి మ్యూజిక్‌ అందించాడు.

►  ‘మీరు రోడ్‌ సైడ్‌ టీ షాప్‌లో టీ తాగి ఎన్ని రోజులు అయింది?... ఈ సినిమాలో ఇలాంటి క్యారెక్టర్‌నే మీరు చేయబోతున్నారు’ అని చెప్పాడు విఘ్నేష్‌. ఈ సినిమా చేస్తున్నప్పుడు చదువు అయిపోయి నెక్స్‌›్ట ఏం ఉద్యోగం చేయాలి? అనే రోజులు మళ్లీ గుర్తొచ్చాయి. నా ఫస్ట్‌ సాలరీ 726 రూపాయిలు. నా రూట్స్‌ని నేను ఎప్పుడూ మరచిపోలేదు.

► ఈ మధ్య వరుసగా దేశాలను, రాష్ట్రాలను కాపాడే పాత్రలను చేశాను, ఈ సినిమా కొంచెం రియలిస్టిక్‌ అప్రోచ్‌తో ఉంటుంది.  ఈ సినిమా చాలా లైట్‌ హార్టెడ్‌గా ఉంటుంది. ఫుల్‌ టూ ఎంటర్‌టైన్‌మెంట్‌.

► ఫస్ట్‌ టైమ్‌ నా పాత్రకు నేనే డబ్బింగ్‌ చెప్పుకున్నాను. చాలా ఎంజాయ్‌ చేశాను. నేను చదువుకున్న తమిళ లిటరేచర్‌లో ‘సుందర తెలుంగు’ అన్నారు. ఇండియాలో స్వీటెస్ట్‌ లాంగ్వేజ్‌ తెలుగు అని అర్థం. తమిళ డబ్బింగ్‌కు ఎనిమిది రోజులు తీసుకుంటే తెలుగు డబ్బింగ్‌ కేవలం ఆరు రోజుల్లో పూర్తి చేసేశాను. థాంక్స్‌ టు శశాంక్‌ వెన్నెలకంటి.

► ముందు టీజర్‌కు డబ్బింగ్‌ చెప్పాను. చాలా మంచి ఫీడ్‌ బ్యాక్‌ వచ్చింది. ఆ కాన్ఫిడెన్స్‌తో సినిమాకు డబ్బింగ్‌ చెప్పాను. ∙ప్రయోగాలు చేయటం ఎప్పుడూ ఆపను. అలాంటి కొత్త కాన్సెప్ట్‌లు రావాలంటే టైమ్‌ పడుతుంది. ఆ స్క్రిప్ట్‌లు అంత సులువుగా రావు. ఏదైనా ఎక్స్‌పె రిమెంట్‌ మూవీ చేశాక వెంటనే మంచి కమర్షియల్‌ చేయడం కరెక్ట్‌. ‘7 సెన్స్‌’ సినిమా అప్పుడు మా దగ్గర బడ్జెట్‌ లేదు. కానీ ‘సింగం’ విడుదలై మంచి విజయం సాధించింది. అప్పుడు ప్రొడ్యూసర్స్‌ దొరికారు. అలా కమర్షియల్‌ సినిమా చేస్తూ నా మార్కెట్‌ కాపాడుకుంటూనే ప్రయోగాలు చేయాలను కుంటున్నాను.

► సెల్వ రాఘవన్‌తో ఒక సినిమా స్టార్ట్‌ చేశాం. సాయి పల్లవి, రకుల్‌ ప్రీత్‌ హీరోయిన్లు.  ఆ తర్వాత కేవీ ఆనంద్‌తో ఒక సినిమా చేయాలి.

► నేను, కార్తీ కలిసి ఓ సినిమా చేద్దాం అనుకున్నాం.. కుదర్లేదు. నేనో స్ట్రైట్‌ తెలుగు సినిమా చేయాలనుకుంటు న్నాను కానీ ఎందుకో కుదరడం లేదు. త్వరలో నెరవేరుతుందను కుంటున్నాను.

తమిళనాడు పాలిటిక్స్‌లో మంచి చేంజ్‌ రాబోతుంది అనుకుంటున్నాను. రజనీకాంత్, కమల్‌హాసన్‌ సార్‌లది డిఫరెంట్‌ ఐడియాలజీ. వాళ్ల ఒపీనియన్‌ వేరైనా మొన్న మలేసియాలో జరిగిన స్టార్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో అలా స్నేహంగా ఒకరి భుజం మీద ఒకళ్లు చేతులు వేసుకొని నిలబడి, మన యంగర్‌ జనరేషన్స్‌కు మంచి ఎగ్జాంపుల్‌ సెట్‌ చేశారు. సినిమాలు హిట్‌ అవుతున్నాయి మనకి జనం ఓటు వేస్తారనుకుంటే పొరబాటే. అది వాళ్లకీ తెలుసు. మార్పు తీసుకొస్తారని నమ్ముతున్నాను. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన నాకు లేదు. మనల్ని మార్చగలిగేది ఎడ్యుకేషన్‌ అని నా నమ్మకం. అందుకే ‘అగరం ఫౌండేషన్‌’ స్థాపించాను. దీని ద్వారా 2000 మందిని విద్యావంతుల్ని చేస్తున్నాను.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top