‘సంచలన’ అభిమానిని చూసి హీరో షాక్‌! | Sakshi
Sakshi News home page

‘సంచలన’ అభిమానిని చూసి హీరో షాక్‌!

Published Mon, Jun 4 2018 12:24 PM

Actor Govinda Message To His Fan Sanjeev Srivastava Alias Dancing Uncle - Sakshi

లండన్‌/విదిషా: డాన్సింగ్‌ వీడియోతో ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించి, ఏకంగా ప్రభుత్వ బ్రాండ్‌ అంబాసిడర్‌ కూడా అయిపోయిన తన వీరాభిమాని, ‘డాన్సింగ్‌ అంకుల్‌’  సంజీవ్‌ శ్రీవాస్తవకు హీరో గోవిందా సందేశం పంపాడు. ఓ స్నేహితుడు పంపిన ఆ డాన్సింగ్‌ వీడియో చూసి చిన్నపాటి షాక్‌కు గురయ్యానని, ఒకరు మనల్ని అనుకరించడం ఎంతైనా ఆనందించాల్సిన విషయమేనని వెటరన్‌ హీరో అన్నారు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న ఆయన ‘ఇండియా టుడే’ వార్తా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడారు.

మీ భార్య కూడా కాలుకదపడం చాలా బాగుంది: ‘‘ ఏదో డాన్స్‌ చేస్తున్నట్లు కాకుండా పూర్తిగా లీనమై స్టెప్పులు వేశారు. తెలియకుండానే నన్ను అనుకరించారు. నిజంగా ఎవరైనా మనల్ని అనుకరిస్తుంటే అంతకంటే సంతోషం ఏముంటుంది? ఈ సందర్భంగా సంజీవ్‌ శ్రీవాస్తవ గారికి నా సందేశమిదే.. ‘మీరు డాన్స​ చేసిన విధానం, ఎంజాయ్‌ చేసిన తీరు నిజంగా ఆనందింపజేసేలా ఉన్నాయి. కూడా మీ భార్య సైతం స్టెప్స్‌ వేయడం చాలా బాగుంది. ఎప్పటికీ మీరు ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా..’’ అని గోవిందా అన్నారు.

బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియామకం: ‘డాన్సింగ్‌ అంకుల్‌’గా ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించిన విదిషా వాసి,  ప్రొఫెసర్‌ సంజీవ్‌ శ్రీవాస్తవను మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ దగ్గర్నుంచి పెద్దపెద్ద సెలబ్రిటీలంతా పొగడ్తలతో ముంచెత్తిన సంగతి తెలిసిందే. డాన్స్‌లో గోవిందానే తనకు ప్రేరణ అని చెప్పుకున్న సంజీవ్‌ని.. విదిషా మున్సిపల్‌ కార్పొరేషన్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement