‘ఆటగాళ్ళు’ మూవీ రివ్యూ

Aatagallu Telugu Movie Review - Sakshi

టైటిల్        : ఆటగాళ్ళు
జానర్       : థ్రిల్లర్‌
తారాగణం  : నారా రోహిత్, జగపతి బాబు, దర్శన బానిక్, సుబ్బరాజు, బ్రహ్మానందం
సంగీతం    : సాయి కార్తీక్‌
దర్శకత్వం : పరుచూరి మురళి
నిర్మాత     : వాసిరెడ్డి రవీంద్రనాథ్, వాసిరెడ్డి శివాజీ ప్రసాద్, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర

కెరీర్‌ స్టార్టింగ్‌ నుంచి డిఫరెంట్ సినిమాలు చేస్తూ వస్తున్న యంగ్ హీరో నారా రోహిత్ మరో డిఫరెంట్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సీనియర్ నటుడు జగపతి బాబుతో కలిసి ఆటగాళ్ళుగా ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. లాంగ్‌ గ్యాప్‌ తరువాత పరుచూరి మురళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై టీజర్‌ రిలీజ్‌ అయిన దగ్గర నుంచే మంచి హైప్‌ క్రియేట్‌ అయ్యింది. మరి ఆ అంచనాల్ని ఆటగాళ్ళు అందుకున్నారా..? నారా రోహిత్‌ ఈ సినిమాతో కమర్షియల్ హిట్ సాధించాడా..?

కథ ;
ఎప్పటికైనా మహాభారతాన్ని డైరెక్ట్‌ చేయాలని కలలు గనే సినీ దర్శకుడు సిద్ధార్థ్ (నారా రోహిత్‌) . ఆ ప్రాజెక్టు పని మీద అంజలి(దర్శన్ బానిక్) అనే అమ్మాయిని కలిసి సిద్ధార్థ ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. మూడేళ్ల తర్వాత తన ఇంట్లోనే అంజలి ని దారుణంగా హత్య చేస్తారు. తన భార్యను చంపిన కేసులో సిద్ధార్థ్ ను రిమాండ్ కు పంపిస్తారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీరేంద్ర (జగపతిబాబు) సిద్ధార్థ్ ని కేసు నుంచి బయట పడేస్తాడు. (సాక్షి రివ్యూస్‌) అంజలిని చంపిన కేసు లో మున్నా అనే వ్యక్తికి శిక్ష పడుతుంది. నిజంగా మున్నానే అంజలి చంపాడా.? సిద్ధార్థని విడిపించిన వీరేంద్రే తనని ఎందుకు చంపాలనుకున్నాడు.? సిద్ధార్థ, వీరేంద్రల మధ్య యుద్ధంలో ఎవరు గెలిచారు? అన్నదే మిగతా కథ. 

నటీనటులు ;
ఎత్తుకు పై ఎత్తులతో సాగే కథలో నారా రోహిత్, జగపతిబాబులు ఒకరితోఒకరు పోటి పడి నటించారు. రొమాంటిక్‌ సన్నివేశాల్లో లవర్‌ బాయ్‌ గా కనిపించిన నారా రోహిత్ తరువాత సీరియస్‌ లుక్‌లోనూ సూపర్బ్ అనిపించాడు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మరోసారి తన మార్క్ చూపించాడు. న్యాయం ఎటు ఉంటే అటు వైపే వాదించే లాయర్‌గా జగపతిబాబు నటన సినిమాకు ప్లస్ అయ్యింది. హీరోయిన్‌ గా నటించిన దర్శన బానిక్‌ ది కథా పరంగా కీలక పాత్రే అయిన నటనకు పెద్దగా ఆస్కారం లేదు. (సాక్షి రివ్యూస్‌)  ఉన్నంతలో నటనతో పాటు గ్లామర్‌షోతోను మంచి మార్కులు సాధించింది. చాలా కాలం తరువాత బ్రహ్మానందంకు కామెడీకి మంచి స్కోప్‌ ఉన్న పాత్ర దక్కింది. పోలీస్‌ ఆఫీసర్‌గా సుబ్బరాజు ఆకట్టుకున్నాడు. ఇతర పాత్రల్లో తులసి, శ్రీతేజ్, జీవా తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. 

విశ్లేషణ ;
ఓ కేసు నేపథ్యంలో కథా కథనాలను తయారు చేసుకున్న దర్శకుడు పరుచూరి మురళి నటీనటులు ఎంపికలో సగం సక్సెస్‌ అయ్యాడు. ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలకు ఎప్పుడు ముందుండే నారా రోహిత్, ప్రస్తుతం ఫుల్‌ ఫాంలో ఉన్న నటుడు జగపతి బాబు సినిమా స్థాయిని పెంచారు. ఫస్ట్ హాఫ్‌లో ఎక్కువ సేపు హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలకు కేటాయించిన దర్శకుడు అసలు కథ స్టార్ట్ చేయడానికి చాలా సమయం తీసుకున్నాడు. కథనంలో థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన వేగం కనిపించలేదు. (సాక్షి రివ్యూస్‌)  ముఖ్యంగా లవ్ ట్రాక్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. ఫస్ట్ హాఫ్‌లో బ్రహ్మానందం కామెడీ కాస్త రిలీఫ్. కోర్టు సీన్  స్టార్ట్ అయిన తర్వాత కథనం ఆసక్తికరంగా మారుతుంది. సాయి కార్తీక్‌ సంగీతం పరవాలేదు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్‌ ;
నారా రోహిత్, జగపతి బాబు నటన
నేపథ్య సంగీతం 

మైనస్‌ పాయింట్స్ ;
లవ్‌ సీన్స్‌
స్లో నేరేషన్

సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్‌ డెస్క్‌. 

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top