ఆర్తి చాలా అమాయకురాలు | Aarthi agarwal was innocent, says vijay bhaskar | Sakshi
Sakshi News home page

ఆర్తి చాలా అమాయకురాలు

Jun 6 2015 3:34 PM | Updated on Sep 3 2017 3:19 AM

ఆర్తి చాలా అమాయకురాలు

ఆర్తి చాలా అమాయకురాలు

ఆర్తి అగర్వాల్ చాలా మంచి అమ్మాయని, చిన్న వయసులోనే చనిపోవడం దురదృష్టకరమని దర్శకుడు విజయ్ భాస్కర్ అన్నారు.

ఆర్తి అగర్వాల్ చాలా మంచి అమ్మాయని, చిన్న వయసులోనే చనిపోవడం దురదృష్టకరమని దర్శకుడు విజయ్ భాస్కర్ అన్నారు. ఆర్తి మరణించారనే వార్త విని షాకయ్యానని చెప్పారు. టాలీవుడ్లో ఆర్తి తొలిసారి విజయ్ భాస్కర్ విజయ్ భాస్కర్ దర్శకత్వంలో నటించారు. 2001లో ముంబైలో ఆర్తి ఫొటో చూసిన తర్వాత వారి కుటుంబ సభ్యులతో మాట్లడి సినిమాలో నటించే అవకాశం ఇచ్చానని విజయ్ భాస్కర్ గుర్తు చేసుకున్నారు. ఆర్తి చాలా అమాయకురాలని, కష్టపడేతత్వమని చెప్పారు. అప్పట్లో ఆమెకు అనారోగ్య సమస్యలున్నట్టు తనకు తెలియదని, ఆ తర్వాత వచ్చి ఉండొచ్చని విజయ్ భాస్కర్ అన్నారు.

ఆర్తికి మంచి భవిష్యత్ ఉంటుందని అనుకున్నానరి, చిన్న వయసులో చనిపోవడం బాధాకరమని విజయ్ భాస్కర్ అన్నారు. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో వెంకటేష్ సరసన ఆర్తి నటించిన నువ్వు నాకు నచ్చావు ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో మంచి గుర్తింపు పొందిన ఆర్తి ఆ తర్వాత అనతికాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement