చైనాలో రికార్డుల మోత మోగిస్తున్న దంగల్‌ | Aamir Khan's dangal crosses Rs 100 Cr mark in China, breaks PK Record | Sakshi
Sakshi News home page

చైనాలో ఆ సినిమా రికార్డుల మోత

May 11 2017 9:33 AM | Updated on Aug 13 2018 3:45 PM

చైనాలో రికార్డుల మోత మోగిస్తున్న దంగల్‌ - Sakshi

చైనాలో రికార్డుల మోత మోగిస్తున్న దంగల్‌

బాలీవుడ్‌ హీరో ఆమిర్ ఖాన్ నటించిన రియల్ లైఫ్ స్పోర్ట్స్ డ్రామా ’దంగల్’ చిత్రం చైనాలో రికార్డుల మోత మోగిస్తోంది.

ముంబయి: బాలీవుడ్‌ హీరో ఆమిర్ ఖాన్ నటించిన రియల్ లైఫ్ స్పోర్ట్స్ డ్రామా ’దంగల్’  చిత్రం చైనాలో రికార్డుల మోత మోగిస్తోంది. 7వేల స్క్రీన్లలో విడుదలైన తొలిరోజే రూ. 15 కోట్ల కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే  రూ.120 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని ఆమీర్‌ ఖాన్‌ ప్రొడక్షన్స్‌ అధికార ప్రతినిధి వెల్లడించారు.

గతంలో ఆమీర్‌ పీకే చిత్రంలో చైనాలోరూ.100 కోట్లు కలెక్షన్లు రాబట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కలెక్షన్లను ఇప్పడు దంగల్‌ దాటేసి, రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా ఆమిర్‌, దర్శకుడు నితీశ్‌ తివారీ చైనా ప్రేక్షకులకు సోషల్‌మీడియా ద్వారా ధన్యవాదాలు తెలిపారు.

చైనీస్‌ సోషల్‌ మీడియా వెబ్‌సైట్లతో పాటు రాసిన వార్తలను ట్రాన్స్‌లేషన్‌ ద్వారా ఎప్పటికప్పుడు రియాక్షన్స్‌ తెలుసుకుంటునే ఉన్నామని ఆమీర్‌ తెలిపారు. హరియాణాకి చెందిన మల్లయోధుడు మహావీర్‌ సింగ్‌ ఫొగట్‌ జీవితాధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. కాగా చైనాలో దంగల్‌ సినిమా విడుదల చేయడానికి ముందు దాని ప్రమోషన్ కోసం బీజింగ్, షాంఘై, చాంగ్‌డు నగరాల్లో ఆమిర్ ఖాన్ పర్యటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement