
ఒకప్పుడు బాలీవుడ్‌లో హిట్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్న జోడి ఆమిర్ ఖాన్, జూహీ చావ్లా. ఖయామత్ సే ఖయామత్ తక్, లవ్ లవ్ లవ్, ఇష్క్ లాంటి సినిమాలో కలిసి నటించిన ఈ జోడి ఓ చిన్న గొడవ కారణంగా ఏకంగా ఏడేళ్ల పాటు మాట్లాడుకోలేదట. ఈ విషయాన్ని ఆమిర్ ఖాన్ స్వయంగా వెల్లడించారు. ఇష్క్ సినిమా షూటింగ్ సందర్భంగా ఆమిర్, జూహీల మధ్య గొడవ జరిగింది.
ఈ గొడవతో దూరమైన ఆమిర్, జూహీలు ఏడేళ్ల పాటు మాట్లాడుకోలేదట. అయితే ఆమిర్, రీనాలు విడాకులు తీసుకుంటున్నట్టుగా తెలియటంతో జూహీచావ్లానే గొడవ పక్కన పెట్టి ఆమిర్, రీనాలను వారించే ప్రయత్నం చేసిందట. దీంతో ఆమిర్, జూహీల మధ్య తిరిగి స్నేహం చిగురించింది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమిర్ నటించిన థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది.