తన రికార్డును తానే బ్రేక్ చేసిన అమీర్ | Aamir Khan breaks his own record with Dhoom-3 | Sakshi
Sakshi News home page

తన రికార్డును తానే బ్రేక్ చేసిన అమీర్

Jan 14 2014 1:33 PM | Updated on Sep 2 2017 2:38 AM

తన రికార్డును తానే బ్రేక్ చేసిన అమీర్

తన రికార్డును తానే బ్రేక్ చేసిన అమీర్

బాలీవుడ్ లో తన రికార్డులను తానే అధిగమించడం 'మిస్టర్ ఫర్ ఫెక్ట్' అమీర్ ఖాన్ కు కొత్తేమి కాదు.

బాలీవుడ్ లో తన రికార్డులను తానే అధిగమించడం 'మిస్టర్ ఫర్ ఫెక్ట్' అమీర్ ఖాన్ కు కొత్తేమి కాదు. ధూమ్ సిరిస్ లో అమీర్ ఖాన్ 'వన్ మ్యాన్ షో' ప్రదర్శన సృష్టిస్తున్న ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 517 కోట్ల రూపాయలను వసూలు చేసిన బాలీవుడ్ చిత్రంగా 'ధూమ్-3' సరికొత్త రికార్డును నెలకొల్పింది.
 
అయితే అమీర్ ఖాన్ గతంలో 3 ఇడియెట్స్ చిత్రం ద్వారా ఓవర్సీస్ మార్కెట్ లో అత్యధికంగా వసూలు చేసిన రికార్డును 'ధూమ్-3'తో  బ్రేక్ చేశారు. నాలుగవ వారంలో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న ధూమ్-3 చిత్రం ఓవర్సీస్ మార్కెట్ లో 161.85 (26.30 మిలియన్ డాలర్లు)కోట్లు నికర వసూలు చేసింది. దేశీయ మార్కెట్ లో ఈ చిత్రం 276.75 నికర వసూళ్లను రాబట్టింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement