దీనికి సీక్వెల్ చేస్తాం! | A sequel to Ala Ela on the anvil | Sakshi
Sakshi News home page

దీనికి సీక్వెల్ చేస్తాం!

Dec 26 2014 11:59 PM | Updated on Sep 2 2017 6:47 PM

దీనికి సీక్వెల్ చేస్తాం!

దీనికి సీక్వెల్ చేస్తాం!

రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిశోర్, శానీ సోలోమన్, ఖుషి, హెబ్బా పటేల్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘అలా ఎలా?’.

రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిశోర్, శానీ సోలోమన్, ఖుషి, హెబ్బా పటేల్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘అలా ఎలా?’. అనీష్ కృష్ణ దర్శకత్వంలో అశోక్ వర్ధన్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోందని చిత్ర యూనిట్ ఆనందం వెలిబుచ్చింది.

ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ‘అందాల రాక్షసి’ తర్వాత తనకు అంత మంచి పేరు తెచ్చిన సినిమా ఇదేనని రాహుల్ రవీంద్రన్ చెప్పారు. ఇదే టీమ్‌తో ఈ సినిమాకుసీక్వెల్ చేయాలనుకుంటున్నామనీ, వచ్చే ఏడాది ప్రథమార్ధంలో షూటింగ్ మొదలుపెడతామనీ దర్శకుడు చెప్పారు. చిత్ర బృందంలో పలువురు ఈ కార్యక్రమంలో మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement