6 నిమిషాలకు 6 కోట్లు

6 minutes Rs 6 Cr spend for Pushpa Movie - Sakshi

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న‘పుష్ప’ చిత్రానికి సంబంధించి  ఏదో ఒక క్రేజీ న్యూస్‌ ఎప్పటికప్పుడు బయటకు వస్తోంది. తాజా వార్త ఏంటంటే.. ఈ సినిమాలో ఓ యాక్షన్‌ ఎపిసోడ్‌ ను 6 కోట్ల వ్యయంతో చిత్రీకరించాలనుకుంటున్నారట. ‘ఆర్య’, ‘ఆర్య 2’ సినిమాల తర్వాత అల్లు అర్జున్‌ – సుకుమార్‌ కాంబినేషన్‌ లో రూపొందుతోన్న మూడో సినిమా ఇది.

మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్నా కథానాయిక. సునీల్‌ శెట్టి, బాబీ సింహా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ ఇంట్రడక్షన్‌ ఫైట్‌ సీన్‌ను సరికొత్తగా డిజైన్‌ చేశారట సుకుమార్‌. సుమారు 6 నిమిషాలు సాగే ఈ యాక్షన్‌ సన్నివేశానికి 6 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారట. ప్యాన్‌ ఇండియన్‌ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. చదవండి: భారతీయుడు ఆగలేదు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top