గొర్రెల పంపిణీ ఘనత కేసీఆర్‌దే

sheep distribution criedit goes to KCR: yegge mallesham - Sakshi

సదాశివపేట(సంగారెడ్డి): కురుమలు ఆర్థికంగా ఎదిగేందుకు వారికి సబ్సిడీపై గొర్రెలు పంపిణీ చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యెగ్గె మల్లేశం అన్నారు. పట్టణంలోని శుక్రవారం నిర్వహించిన మల్లికార్జున స్వామి కురుమ సంఘం ద్వితీయ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత పాలకులు కురుమజాతిని, కురుమల సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కురుమల జీవన స్థితిగతులను గమనించి గొర్రెలను సబ్బడీపై పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. కురుమలకు గొర్రెల పంపిణీతో పాటు రాజకీయ ప్రాధాన్యం కల్పిస్తానని ప్రకటించడం హర్షించద్గ విషయమన్నారు.

ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ అన్ని కులాలకు సముచిత స్థానం కల్పించేందుకు వినూత్న పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. ప్రభుత్వం అందజేసిన సబ్బిడీ గొర్రెలను అమ్మకుండా పోషించుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో కురుమసంఘం జిల్లా అధ్యక్షుడు బూరుగడ్డ పుష్పనాగేశ్, జిల్లా నాయకుడు డాక్లర్‌ శ్రీహరి, మహిళ కన్వీనర్‌ గీత, సదాశివపేట మం డల కురుమ సంఘం అధ్యక్షుడు కొత్తగొల్ల కృష్ణ, గడ్డమీది సత్యనారాయణ, మునిపల్లి మండల అధ్యక్షుడు శంకరయ్య, ప్రధాన కార్యదర్శి బండారి పాండు, ఆత్మకమిటీ చైర్మన్‌ సత్యనారాయణ, మల్లికార్జున కురుమ సం ఘం అధ్యక్షుడు పైతర సాయికుమార్, నాయకు లు అ నంతయ్య,  రాంచందర్, చంద్రన్న, బక్కన్న, గో పాల్, శివశంకర్, రాములు, మల్లేశం, కిష్టయ్య, హనుమయ్య, జగన్నాథం, శివశంకర్, నర్సింలు పాల్గొన్నారు. 

Read latest Medak News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top