అరాచకశక్తుల భరతం పట్టండి

పోలీసులకు డీజీపీ ఆదేశం
సాక్షి, మహబూబ్‌నగర్: అరాచక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడికక్కడ వారిని ఉక్కుపాదంతో అణచివేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డి పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించారు. మంగళవారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులతో డీజీపీ సమీక్ష జరిపారు. అలాగే జిల్లాలో అమలవుతున్న శాంతిభద్రతల గురించి ఎస్పీని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతిభద్రలను కాపాడడంలో పోలీసులు నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. నిత్యం పోలీసులు అందుబాటులో ఉంటూ ప్రజలకు జవాబుదారిగా ఉండాలని పోలీస్ అధికారులకు డీజీపీ సూచించారు.