ఓ వ్యక్తిని మనస్ఫూర్తిగా, నిజాయితీగా ప్రేమిస్తే! వెంటనే..

Valentines Week : Teddy Day Give A Bear Gift To Loved - Sakshi

వాలెంటైన్స్‌ వీక్‌ మొదలై  అప్పుడే నాలుగు రోజులు అవుతోంది. వాలెంటైన్‌ వీక్‌ సందర్భంగా బహుమతులతో ప్రేమను వ్యక్తపరుచుకునే జంటలకు మరో ముఖ్యమైన రోజు ‘టెడ్డీ డే’... ఈ రోజు ప్రేమికులు ఒకరికొకరు అందమైన టెడ్డీ బేర్‌ బొమ్మలను ఇచ్చిపుచ్చుకుని ఒకరిపై ఒకరికున్న ప్రేమను తెలియజేసుకుంటారు. టెడ్డీ బేర్‌ క్యూట్‌నెస్‌, సంతోషానికి గుర్తు. మనం ఎదుటి వ్యక్తికి ఇచ్చే టెడ్డీ బేర్‌ రకాల్ని బట్టి మనం వారిని ఎంత ప్రేమిస్తున్నామో తెలియజేయవచ్చు. ఇద్దరి మధ్యా అందమైన బంధాన్ని నెలకొల్పటానికి టెడ్డీ బేర్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా ఈ రోజును సెలబ్రేట్‌ చేసుకోవచ్చు. ముఖ్యంగా చాలామంది ఆడపిల్లల జీవితంలోని ఏదో ఒక సందర్భం ఈ టెడ్డీ బేర్‌తో ముడిపడిఉండటం పరిపాటి.

అందుకే ఓ అందమైన టెడ్డీ బేర్‌ను ఎంచుకోండి! మీ ప్రియమైన వారికి బహుమతిగా ఇ‍వ్వండి. అయితే మనం చేయవల్సిందల్లా మన మనసులోని భావాలను ప్రతిబింబించేలా ఓ టెడ్డీ బేర్‌ను ఎంచుకోవటమే. ఆ తర్వాత మీరు వారి గురించి ఏమనుకుంటున్నారో తెలియజేస్తూ ఓ సందేశాన్ని రాసి ఆ బొమ్మకు అతికించండి. ఎందుకంటే కేవలం బహుమతులే కాదు! మనం ప్రేమగా వారిని ఉద్ధేశించి రాసే నాలుగు వాఖ్యాలు కూడా ఎదుటి వ్యక్తికి ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. 

మీ ప్రేమకు రంగులద్దండి!
ఒక్కో రంగు టెడ్డీ బేర్‌ ఒక్కో అర్థాన్నిస్తుంది. అందుకే బొమ్మను కొనబోయే ముందు మీ ప్రియమైన వారికి ఎలాంటి రంగు ఇవ్వాలనుకుంటున్నారో తెలుసుకోవటం ముఖ్యం. 
పింక్‌ : ఈ రంగు ఎదుటి వ్యక్తిపై మనకున్న అన్‌కండిషనల్‌ లవ్‌ను, ఎఫెక్షన్‌, కంపాషన్‌ను తెలియజేస్తుంది. 
తెలుపు : ఈ రంగు అమాయకత్వానికి, అందానికి ప్రతిబింబంలాంటిది. ఈ రంగు ఓ కొత్త ప్రారంభాన్ని కూడా సూచిస్తుంది.
ఎరుపు : ఇది ఎదుటి వ్యక్తిపై మనకున్న ప్రేమను తెలియజేస్తుంది.
ఆరెంజ్‌ : ఈ రంగు సంతోషాన్ని, ప్యాషన్‌, పాజిటివ్‌ ఎనర్జీని సూచిస్తుంది.
నీలం : ఈ రంగు టెడ్డీ బేర్‌ నిజాయితీ, నమ్మకానికి చిహ్నం. మీరో వ్యక్తిని మనస్ఫూర్తిగా, నిజాయితీగా ప్రేమిస్తున్నట్లయితే వెంటనే నీలం రంగు టెడ్డీ బేర్‌ను కొని వారికి బహుమతిగా ఇవ్వండి.


Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top