తన బెంచ్‌ ఎదురుగా కూర్చొని సైట్‌ కొట్టేవాడ్ని. | Sad Ending Telugu Reader Love Story | Sakshi
Sakshi News home page

తన బెంచ్‌ ఎదురుగా కూర్చొని సైట్‌ కొట్టేవాడ్ని.

Jan 31 2020 1:02 PM | Updated on Jan 31 2020 2:08 PM

Sad Ending Telugu Reader Love Story  - Sakshi

తనని మొదటిసారి డిగ్రీ ఫస్ట్‌ ఇయర్‌లో చూశాను. చూడగానే నచ్చేసింది. తను కూర్చునే బెంచ్‌కి ఎదురుగా కూర్చొని తననే చూస్తూ ఉండేవాడిని. రెండు సంవత్సరాలు అలా గడిచిపోయాయి. మా ఫ్రెండ్‌ బర్త్‌డే పార్టీలో తనతో మొదటిసారి మాట్లాడాను. తర్వాత మాట్లాడాలని ఉన్నా ధైర్యం చేయలేకపోయా. డిగ్రీ లాస్ట్‌ ఇయర్‌ లాస్ట్‌ డే చూశా తనని ఓ టెంపుల్‌లో. తర్వాత రెండేళ్లకి ఓ బస్టాప్‌లో ఎదురుపడింది. నన్ను చూడగానే నవ్వుతూ పలకరించింది. తనే మాట్లాడింది కదా అని నేను ఆరోజు కాల్‌ చేశా. ఆరోజు నుంచి రోజూ ఫోన్‌లో మాట్లాడుకునేవాళ్లం. 

అలా మూడేళ్లు గడిచాయి. కానీ ఒక్కసారి కూడా డైరెక్ట్‌గా కలవలేదు. ఓరోజు ఫోన్‌ చేసి నాకు పెళ్లి కుదిరింది అని చెప్తూనే నువ్వంటే నాకిష్టం కానీ మా ఫ్యామిలీని బాధపెట్టలేను అంది. నేను కూడా ఆలోచించి తన నిర్ణయాన్ని కాదనలేదు. ఫ్రెండ్స్‌లా ఉండాలని డిసైడ్‌ అయ్యాం. అలానే ఉంటున్నాం కూడా. తనని అప్పుడప్పుడు చాలా మిస్‌ అవుతుంటా. ఇప్పటికీ నువ్వంటే అదే ప్రేమ. కానీ ఒక్కసారి కూడా నిన్ను డైరెక్ట్‌గా కలిసి మాట్లాడలేదు అనే చిన్న బాధ మాత్రం ఉంది. మిస్‌ యూ...

--ఉదయ్‌ (పేరు మార్చాం), కామారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement