అలాంటి వారినే తరుచు ప్రేమిస్తాం

People Again And Again Fall In Love With The Same Type Of Person - Sakshi

ఓ సారి ప్రేమలో ఎదురుదెబ్బ తగిలిన తర్వాత ఏం చేస్తాం?.. ఇంకోసారి అలాంటి వ్యక్తి జోలికి వెళ్లకూడదని, ప్రేమించకూడదని అనుకుంటాం. కానీ, గతంలో మనం ఎదురుదెబ్బ తిన్న భాగస్వామి లాంటి వారినే మరల ప్రేమిస్తామని తాజాగా ‘‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్‌’’ చేపట్టిన అధ్యయనంలో తేలింది. మామూలుగా ఎదుటివ్యక్తితో తెగతెంపులు చేసుకున్న తర్వాత వారి వ్యక్తిత్వాన్ని తప్పుబట్టటమే కాకుండా అలాంటి వారిని అసలు ప్రేమించకుండా ఉండాల్సింది అనుకుంటాము. అయితే మనలో పాతుకుపోయిన ఓ బలమైన ధోరణి మాజీ భాగస్వామిలాంటి వ్యక్తులను ప్రేమించటానికే మొగ్గుచూపుతుందని యూబిన్‌ పార్క్‌ అనే పరిశోధకుడు పేర్కొన్నారు. యూబిన్‌ పార్క్‌, జెఫ్‌ మెక్‌డొనాల్డ్‌లు వివిధ వయస్సుల్లోని వ్యక్తులపై అధ్యయనం చేపట్టారు.

వారి ప్రస్తుత, గతం తాలూకు వ్యక్తిత్వాలను సరిపోల్చారు. ఎక్కువమంది తమలాంటి భావాలు కల్గిన వ్యక్తులను ప్రేమించటానికే ఆసక్తి కనబరుస్తున్నారని వారి అధ్యయనంలో తేలింది. ప్రస్తుతం వారు ప్రేమలో ఉన్న, గతంలో విడిపోయిన వ్యక్తుల వ్యక్తిత్వాలు ఒకేలాగ ఉన్నాయని వారు వెల్లడించారు. రిలేషన్‌షిప్‌లు మారుతున్నా సమస్యలు ఉత్పన్న మవ్వటంలో మార్పులేకపోవటానికి ఇదే ప్రధాన కారణమని పేర్కొన్నారు.


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top