ఆమె అలా అడిగే సరికి నా గుండె జారిపోయింది!

Love Stories In Telugu : Venky Degree Love From Kurnool - Sakshi

కాలేజీలో చేరిన కొత్తలో ఓ రోజు... మా క్లాస్‌లోకి అడుగుపెట్టింది హెచ్‌ఆర్‌ఎమ్‌ లెక్షరర్‌. ఆమెను చూడగానే నా చిన్ననాటి స్నేహితురాలు? గుర్తుకు వచ్చింది. ఆమె వయసు నా కంటే 2,3 సంవత్సరాలు అటుఇటుగా ఉంటుంది. దీంతో ఆమె మీద అభిమానం మొదలైంది. ఆ రోజు క్లాస్‌లో హోం వర్కు ఇచ్చి మరుసటి రోజు రాసుకుని రమ్మంది. ఆమె మీద ఉన్న అభిమానంతో ఓ స్పైరల్‌ బైండింగ్‌ బుక్‌లోని పేపర్‌ చించిమరీ హోంవర్కు రాశాను. మరుసటి ఆమె అందరి దగ్గరా హోంవర్కు పేపర్లును కలెక్ట్‌ చేస్తోంది. నేను నా పేపర్‌ను ఆమెకిచ్చాను. ఆమె దాన్ని చూడగానే ‘ఏం బాబు! ఇంతకంటే మంచి పేపర్‌ దొరకలేదా?’ అంటూ ఆ పేపర్‌ను నా ముఖాన కొట్టినంత పనిచేసింది. నా ఈగో దెబ్బతింది! ‘ఏదో అభిమానం కొద్ది ఖరీదైన పుస్తకంలోని పేపర్‌ చించి రాస్తే.. నా ముఖాన కొడుతుందా’ అని ఆమె మీద అలిగాను. ఇందులో ఆవిడ తప్పుకుడా ఏం లేదు.. ఎందుకంటే ఇక్కడ ఆ పేపర్‌ అంచులు కుక్కలు చింపిన ఇస్తర్లలా ఉన్నాయి. అందుకే ఆమె కొప్పడ్డది. ఓ రోజు ఆమె క్లాసులు చెబుతుంటే నా లోకంలో నేను ఉన్నాను.

ఇది గమనించిన ఆమె నన్ను పిలిచి ‘ ఏం బాబు! క్లాసు బోరుకొడుతోందా?’ అని అడిగింది. ఆమె అలా హఠాత్తుగా అడిగే సరికి నా గుండె జారిపోయినంతపనైంది. అందరిముందు బుక్కయ్యానన్న ఫీలింగ్‌. వెంటనే ‘లేదు మేడమ్‌’ అని చెప్పి క్లాసు మీద శ్రద్ధ చూపించాను. అప్పటినుంచి నాలో భయం, చిరుకోపం మొదలైంది. ఆమె క్లాసంటే కళ్లప్పగించి మరీ వినేవాడిని, ఆమె నన్ను టార్గెట్‌ చేస్తుందేమోనని కళ్లు కూడా పక్కకు తిప్పకుండా ఆమె వైపు చూసేవాడిని. ఓ రోజు క్లాసులోకి అడుగుపెట్టి పోడియం దగ్గరకు వెళ్లగానే ఆమె నన్ను పైకి లేపింది. నేను షాక్‌!. ఏవో క్వశ్చన్లు అడిగింది. ఏదో చెప్పటానికి ట్రై చేశా.. అరకొరగా చెప్పా. ఆ వెంటనే ఆమె ‘ బాగా చెప్పావ్‌! క్లాప్స్‌ కొట్టండమ్మా’ అంది మా క్లాస్‌ మేట్స్‌ని.

‘నేనేమి చెప్పానో నాకు కూడా అర్థం కాలేదు. ఈమెకు ఏం అర్థం అయ్యింది?’ అనుకున్నా మనసులో. అలా ఓ రెండు సార్లు అడిగింది. అప్పటినుంచి ఆమె చెప్పిన క్లాసులను శ్రద్ధగా వినేవాడిని, నేర్చుకునేవాడిని. అయితే క్లాసులో ఒక్కొక్కరిగా అందర్ని క్వచ్చన్లు అడిగి నన్ను మాత్రం అడిగేది కాదు. ఆ రోజునుంచి ఆమె మీద నాకు ఏదో తెలియని ఇది మొదలైంది. ఆమె క్లాసు చెప్పటానికి రాకపోతే ఏదో వెలితిగా అనిపించేది. ఆమె కారణంగా నాకు హెచ్‌ఆర్‌ సబ్జెక్టు ఇష్టమైన సబ్జెక్టుగా అయిపోయింది. యాధృచ్ఛికమో, దేవుడిలీలో వారంలో చాలా రోజులు మేము వేసుకున్న డ్రెస్‌ కలర్లు మ్యాచ్‌ అయ్యేవి. కాలేజ్‌ క్యాంపస్‌లో ఆమె ఎక్కడన్నా ఎదురైతే నా గుండె వేగంగా కొట్టుకునేది.

అప్పుడప్పుడు మా కళ్లు కలుసుకునేవి. ఓ రోజు మార్కెటింగ్‌ క్లాస్‌ జరుగుతోంది. అప్పుడు తనొచ్చింది. హ్యాపీగా ఫీలయ్యా! చేతిలోంచి ఏదో కార్డు తీసి సార్‌కు ఇస్తోంది. ఏంటా అని చూస్తే పెళ్లి పత్రిక.. నేను షాక్‌! ఏదో తెలియని బాధమొదలైంది. ఆమెకు పెళ్లవుతుందని కాదు! నా నుంచి తను దూరం అయిపోతుందని. మరుసటి రోజు నీరసంగా క్లాస్‌కు వచ్చాను. మాటల సందర్భంలో ఆ పెళ్లి వాళ్ల అక్కదని తెలిసింది. చాలా సంతోషించాను. సైడ్‌ లుక్స్‌తో కాలం ఇట్టే గడిచిపోయింది. రెండేళ్లు పూర్తయ్యాయి. థర్డ్‌ ఇయర్‌ మొదలైంది. ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో తీపి గుర్తులు.. థర్డ్‌ ఇయర్‌ ఫస్ట్‌ సెమ్‌ పూర్తవుతున్నపుడు తను మా కాలేజీనుంచి వేరే కాలేజీకి వెళ్లిపోయింది. (గమనిక : ఇది నా వైపు నుంచి నేను ఊహించుకున్న ప్రేమ కథ)
- వెంకీ, కర్నూలు


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

16-02-2020
Feb 16, 2020, 16:49 IST
మీరు ఎంత తరచుగా ఇతరుల భాగస్వాములను లోబర్చుకోవటానికి చూస్తారు...
16-02-2020
Feb 16, 2020, 15:10 IST
2012లో బీటెక్‌ ఫేయిలై నేను ఇంటి దగ్గర ఉన్నా. ఏమీ తోచేది కాదు.. ఇంట్లో వాళ్లు నన్ను తిట్టని తిట్టులేదు....
16-02-2020
Feb 16, 2020, 12:27 IST
సినిమా : తాజ్‌ మహాల్‌(2010) తారాగణం : శివాజీ, శృతి, కోటాశ్రీనివాసరావ్‌, బ్రహ్మానందం, నాజర్‌, రఘుబాబు డైరెక్టర్‌ : అరుణ్‌ శింగరాజు సంగీతం :...
16-02-2020
Feb 16, 2020, 10:46 IST
ప్రతిరోజూ అతడు గుర్తుకువస్తూనే ఉంటాడు. తను ఎక్కడ ఉన్నా...
15-02-2020
Feb 15, 2020, 17:03 IST
తాము ఎదుర్కొన్న వింత అనుభవాలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు...
15-02-2020
Feb 15, 2020, 14:53 IST
ఎలాగైనా అతడ్ని కలిసి క్షమాపణ చెప్పాలనిపిస్తోంది! దానికి తోడు...
15-02-2020
Feb 15, 2020, 12:35 IST
ఎక్కువ మంది మహిళలు వాలెంటైన్స్‌ రోజున ఒంటరిగా...
15-02-2020
Feb 15, 2020, 10:35 IST
తనే ధైర్యం చేసి ‘నన్ను లవ్‌ చేస్తున్నావా’ అని అడిగింది.. కానీ, నేను..
14-02-2020
Feb 14, 2020, 16:50 IST
తన పేరు కౌసల్య! మెడిసిన్‌ చదువుతున్నపుడు మా మధ్య ప్రేమ చిగురించింది. మెడిసిన్‌ అయిపోయిన తర్వాత వేరు వేరు హాస్పిటల్లలో...
14-02-2020
Feb 14, 2020, 15:46 IST
ప్రేమ పేరెత్తితే చాలు నాలుక తెగ్గోస్తారు. ఇలాంటి నేపథ్యంలో యువత ప్రాణాలకు తెగించి.. 
14-02-2020
Feb 14, 2020, 11:56 IST
ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న వాలెంటైన్స్‌ డే రానే వచ్చింది. ప్రియమైన వారితో ఈ రోజును ప్రత్యేకంగా సెలబ్రేట్‌ చేసుకోవాలనుకునేవారు చాలామందే...
14-02-2020
Feb 14, 2020, 10:17 IST
మేషం : మీలోనే దాచుకున్న ప్రేమ విషయాలను ఇష్టులకు తెలియజేసేందుకు శని, ఆదివారాలు అనుకూలం. ఈరోజుల్లో మీరు చేసే ప్రతిపాదనలపై...
14-02-2020
Feb 14, 2020, 08:54 IST
వాళ్లిద్దరూ చిన్ననాటి స్నేహితులు, ప్రేమికులు... ఆ తర్వాత విడిపోయి దశాబ్దాల తర్వాత కలుస్తారు. అప్పటికీ బ్రహ్మచారిగానే ఉన్నప్రేమికుడు, పెళ్లి చేసుకుని...
14-02-2020
Feb 14, 2020, 08:36 IST
త్రేతా యుగంలో సీతారాముల ప్రేమ లోకానికి రావణుడి పీడను వదిలించింది. ద్వాపరంలో సత్యభామ ప్రేమ నరకాసురుడి కథను అంతం చేసింది. కలియుగంలో పద్మావతి...
14-02-2020
Feb 14, 2020, 07:42 IST
సాక్షి, ముషీరాబాద్‌: ప్రేమికులకు గుడ్‌ న్యూస్‌... వాలెంటైన్స్‌ డే రోజున మీరు ఆనందంగా గడిపేందుకు, మీ లవ్‌ను ప్రపోజ్‌ చేసేందుకు,...
14-02-2020
Feb 14, 2020, 00:32 IST
ఇవాళ ప్రేమికుల దినోత్సవం. ప్రేమోత్సవం. ప్రేయసిని ఎలా సర్‌ప్రైజ్‌ చేయాలని ఒకరు, ఈరోజు ఎలా అయినా ప్రేమను చెప్పేయాలని ధైర్యం...
13-02-2020
Feb 13, 2020, 17:05 IST
న్యూఢిల్లీ : ‘ప్రేమ’ అంటే ఎన్నో అనుభూతులు, మరెన్నో అర్థాలు. కాల గమనంలో ప్రేమ వ్యక్తీకరణ పద్ధతులు మారుతూ వస్తున్నాయి....
13-02-2020
Feb 13, 2020, 16:53 IST
అది బాధో! ప్రేమో!.. ఏదో తెలియదు కానీ, నా కళ్లు కొద్దిగా చెమర్చాయి...
13-02-2020
Feb 13, 2020, 15:30 IST
సాక్షి, న్యూఢిల్లీ : యువతీ యువకుల మధ్య ప్రేమ అనేది ఓ మధురానుభూతి. ఈ ప్రేమనే శాస్త్రవిజ్ఞాన పరిభాషలో సంక్లిష్ట...
13-02-2020
Feb 13, 2020, 14:46 IST
నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావ్‌?...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top