కొట్టినా, తిట్టినా.. పెళ్లంటూ చేసుకుంటే బావనే!..

Love Stories In Telugu : Raju And Janu Love, Kakinada - Sakshi

నేను 2010లో 10వ తరగతి మా మావయ్య వాళ్ల ఇంట్లో ఉండి చదువుకున్నా. మావయ్యకి ఒక అమ్మాయి ఉంది. తన పేరు రేణుక తను నా కన్నా 2 ఏళ్లు చిన్నది. తనంటే నాకు చాలా ఇష్టం! నేనంటే కూడా తనకి చాలా ఇష్టం. మేము ఎప్పుడూ గొడవ పడుతూనే ఉండేవాళ్లం. నా 10వ తరగతి అయిపోయాక నేను మా ఊరికి వెళ్లిపోయా. వాళ్ల ఇంటి నుంచి వచ్చినప్పటి నుంచి నాకు నా మరదలే గుర్తొచ్చేది. తనకి ఎలాగైనా నా ప్రేమ గురించి చెప్పాలనుకున్నా. ఒక రోజు వాళ్ల ఇంటికి వెళ్లా. ’నీతో మాట్లాడాలి’ అని అన్నా. తను ‘ఏంటి చెప్పు!’ అంది. నాకు ధైర్యం చాలలేదు.. చాలా భయం వేసింది. మేము భోజనం చేసే టైమ్‌లో నా దగ్గర ఉన్న కీ పాడ్‌ సెల్‌ ఫోన్‌లో ఐ లవ్‌ యూ సింబల్స్‌ చూపించా. అది చూసి నా మరదలు ‘ఏంటి’ అని నవ్వింది. నేను కొంచెం ధైర్యం చేసి ‘నేను నిన్ను ప్రేమస్తున్నాను’ అని చెప్పేశా. తను ఏం మాట్లాడలేదు. ఆ రోజు నేను మా ఇంటికి వెళ్లిపోయాను.

రెండురోజుల తర్వాత తను నాకు ఫోన్ చేసింది! వాళ్ల నాన్న ఫోన్ నుండి. ఆ రోజు నాకు ఇప్పటికీ గుర్తుంది 2010 నవంబర్‌ 15. ఆ రోజు తను ఫోన్ చేసి ‘నువ్వంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం’ అని చెప్పింది. ఇక చూడు నా ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఆ రోజు అంతా నిద్ర కూడా పట్టలేదు. తన గురించే ఆలోచిస్తూ ఉండిపోయా. అలా రెండు సంవత్సరాలు గడిచిపోయింది. 2012లో నేను పాలిటెక్నిక్‌ మూడో సంవత్సరం. తనేమో పదో తరగతి చదువుతోంది. అప్పుడే మా విషయం ఇంట్లో తెలిసిపోయింది. ఆ రోజు చాలా పెద్ద గొడవ అయ్యింది. మా మావయ్య నా మరదలని కొట్టాడు కూడా. ఇంట్లో ఎంత తిట్టినా, కొట్టినా నేనే కావాలని చెప్పేసింది. ‘పెళ్లంటూ చేసుకుంటే బావనే చేసుకుంటా’ అని చెప్పింది.

ఆ రోజు నుంచి వాళ్ల ఇంటికి వెళ్లడం మానేశా. ఓ సంవత్సరంనర్ర పాటు మేము ఒకరినొకరం కలవలేదు, మాట్లాడుకోలేదు. మా ప్రేమ గురించి మా ఇంట్లో.. వాళ్ల ఇంట్లో మా బంధువులందరికీ తెలిసిపోయింది. 2013లో పాలిటెక్నిక్‌ కంప్లీట్‌ అయ్యాక నాకు జాబ్ వచ్చింది. జాబ్ చేస్తూ ఆ అమ్మాయిని తలుచుకుంటూ అలా రోజులు గడిచిపోయాయి. తను ఇంటర్ కాలేజ్‌లో జాయినయ్యింది. ఒకరోజు తను నాకు ఫోన్ చేసింది. వాళ్ల ఫ్రెండ్ మొబైల్ నుంచి. ఆ రోజు మేము చాలా మాట్లాడుకున్నాం. వాళ్ల ఇంట్లో ఏమంటున్నారో చెప్పింది. ‘తనకి ఇష్టమైన వాళ్లనే ఇచ్చి పెళ్లి చేస్తా’ అని వాళ్ల నాన్న అన్నాడని చెప్పింది. నాకు చాలా ఆనందం వేసింది.

అప్పటినుంచి మేము మళ్లీ డైలీ ఫోన్ కాల్స్, మెసేజ్‌లు చేసుకునే వాళ్లం. నేను డైలీ వాళ్ల కాలేజీ దగ్గరకు వెళ్లి కలిసేవాడిని. అలా ఓ సంవత్సరం గడిచిపోయింది. 2015లో నేను ఇంటిదగ్గరలో జాబ్ చేస్తే వాళ్ల నాన్నకి ఎక్కువుగా కనిపిస్తూ ఉంటానని హైదరాబాద్‌లో జాబ్ చూసుకుని వెళ్లిపోయా. అలా మూడు సంవత్సరాలు గడిచిపోయింది. 2018 నా మరదలు డిగ్రీ అయిపోయింది. తనకు క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది. విప్రో కంపెనీ హైదరాబాద్‌లో. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తను హైదరాబాద్ వచ్చేసింది. మేము డైలీ మీట్ అయ్యేవాళ్లం. ఫోన్ కాల్స్, మెసేజెస్ ఇలా మేము చాలా దగ్గరైపోయాం. 
- రాజు, కాకినాడ


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

14-02-2020
Feb 14, 2020, 16:50 IST
తన పేరు కౌసల్య! మెడిసిన్‌ చదువుతున్నపుడు మా మధ్య ప్రేమ చిగురించింది. మెడిసిన్‌ అయిపోయిన తర్వాత వేరు వేరు హాస్పిటల్లలో...
14-02-2020
Feb 14, 2020, 15:46 IST
ప్రేమ పేరెత్తితే చాలు నాలుక తెగ్గోస్తారు. ఇలాంటి నేపథ్యంలో యువత ప్రాణాలకు తెగించి.. 
14-02-2020
Feb 14, 2020, 11:56 IST
ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న వాలెంటైన్స్‌ డే రానే వచ్చింది. ప్రియమైన వారితో ఈ రోజును ప్రత్యేకంగా సెలబ్రేట్‌ చేసుకోవాలనుకునేవారు చాలామందే...
14-02-2020
Feb 14, 2020, 10:17 IST
మేషం : మీలోనే దాచుకున్న ప్రేమ విషయాలను ఇష్టులకు తెలియజేసేందుకు శని, ఆదివారాలు అనుకూలం. ఈరోజుల్లో మీరు చేసే ప్రతిపాదనలపై...
14-02-2020
Feb 14, 2020, 08:54 IST
వాళ్లిద్దరూ చిన్ననాటి స్నేహితులు, ప్రేమికులు... ఆ తర్వాత విడిపోయి దశాబ్దాల తర్వాత కలుస్తారు. అప్పటికీ బ్రహ్మచారిగానే ఉన్నప్రేమికుడు, పెళ్లి చేసుకుని...
14-02-2020
Feb 14, 2020, 08:36 IST
త్రేతా యుగంలో సీతారాముల ప్రేమ లోకానికి రావణుడి పీడను వదిలించింది. ద్వాపరంలో సత్యభామ ప్రేమ నరకాసురుడి కథను అంతం చేసింది. కలియుగంలో పద్మావతి...
14-02-2020
Feb 14, 2020, 07:42 IST
సాక్షి, ముషీరాబాద్‌: ప్రేమికులకు గుడ్‌ న్యూస్‌... వాలెంటైన్స్‌ డే రోజున మీరు ఆనందంగా గడిపేందుకు, మీ లవ్‌ను ప్రపోజ్‌ చేసేందుకు,...
14-02-2020
Feb 14, 2020, 00:32 IST
ఇవాళ ప్రేమికుల దినోత్సవం. ప్రేమోత్సవం. ప్రేయసిని ఎలా సర్‌ప్రైజ్‌ చేయాలని ఒకరు, ఈరోజు ఎలా అయినా ప్రేమను చెప్పేయాలని ధైర్యం...
13-02-2020
Feb 13, 2020, 17:05 IST
న్యూఢిల్లీ : ‘ప్రేమ’ అంటే ఎన్నో అనుభూతులు, మరెన్నో అర్థాలు. కాల గమనంలో ప్రేమ వ్యక్తీకరణ పద్ధతులు మారుతూ వస్తున్నాయి....
13-02-2020
Feb 13, 2020, 16:53 IST
అది బాధో! ప్రేమో!.. ఏదో తెలియదు కానీ, నా కళ్లు కొద్దిగా చెమర్చాయి...
13-02-2020
Feb 13, 2020, 15:30 IST
సాక్షి, న్యూఢిల్లీ : యువతీ యువకుల మధ్య ప్రేమ అనేది ఓ మధురానుభూతి. ఈ ప్రేమనే శాస్త్రవిజ్ఞాన పరిభాషలో సంక్లిష్ట...
13-02-2020
Feb 13, 2020, 14:46 IST
నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావ్‌?...
13-02-2020
Feb 13, 2020, 12:03 IST
ప్రేమ.. ఇదిప్పుడు రెండు అక్షరాల కలయిక మాత్రమే కాదు వేల కోట్ల...
13-02-2020
Feb 13, 2020, 10:43 IST
బాగా ప్రాచూర్యం పొందిన ముద్దు ఇది. మోస్ట్‌ రొమాంటిక్‌ కిస్‌...
13-02-2020
Feb 13, 2020, 10:08 IST
ప్రేమ.. అనిర్వచనీయమైన అనుభూతి. వివాహం.. జీవితంలో ఓ మధురమైన ఘట్టం. తమ పెళ్లి జ్ఞాపకాలు జీవితాంతం ఉండేలా.. తమ హృదిలో...
12-02-2020
Feb 12, 2020, 16:56 IST
అక్కడికి తను కూడా వచ్చింది. ఆ రాత్రి భానును చూస్తూ...
12-02-2020
Feb 12, 2020, 15:35 IST
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు మరింత దగ్గర పడింది. రేపు ఒక్కరోజు గడిస్తే ఆ మరుసటి రోజే ప్రేమికుల...
12-02-2020
Feb 12, 2020, 12:30 IST
తనకి ఓ వాలెంటైన్స్‌ డేన చాక్లెట్‌ ఇస్తే వద్దు అంది...
12-02-2020
Feb 12, 2020, 11:39 IST
న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన సంస్థ ఇంటర్‌ గ్లోబ్‌ ఏవియేషన్‌ (ఇండిగో).. రూ. 999కే దేశీ రూట్లలో టికెట్‌ అందిస్తోంది....
12-02-2020
Feb 12, 2020, 10:59 IST
ఎంత డబ్బు ఖర్చు చేసినా పొందలేని ఆనందం దీని సొంతం...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top