కోరుకున్న జీవితం నీకు రావాలి! | Girl Cheated a Boy For Rich Life | Sakshi
Sakshi News home page

కోరుకున్న జీవితం నీకు రావాలి!

Nov 26 2019 12:57 PM | Updated on Nov 26 2019 1:23 PM

Girl Cheated a Boy For  Rich Life - Sakshi

నాకు చిన్నప్పటి నుంచి అమ్మాయిలతో మాట్లాడాలి అంటే చాలా సిగ్గు, బిడియం. అందుకే ఏ అమ్మాయితో మాట్లాడే వాడిని కాదు. కానీ నాకు చిన్నప్పుటి నుంచి మా ఊరిలో ఉండే ఒక అమ్మాయి అంటే చాలా ఇష్టం. నేను ఎవరితో అంత త్వరగా కలిసే వాడిని కాదు మాట్లాడే వాడిని కాదు. నా మనసులో ఉన్న ఫీలింగ్స్‌ ఎవరితో పంచుకునే వాడిని కాదు. కానీ ఆ అమ్మాయి కోసం వాళ్ల ఇంటి చుట్టూ తిరుగుతూ ఆమెను చూసి ఆనందించే వాడిని. ఆమె అంటే నాకు పిచ్చి ప్రేమ. 

నేను పీజీ చేయడానికి వేరే చోటకు వెళ్లాను. ఒక రోజు తెలియని వ్యక్తి ఫోన్‌ నంబర్‌ నుంచి నాకు మెసేజ్‌ వచ్చింది. నేను రోజూ చూసే ఆ అమ్మాయి నన్ను ఇష్టపడుతుందని, ఆ మెసేజ్‌ చూడగానే నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తరువాత నేను ఆమెకి ఫోన్‌ చేసి నా ప్రేమను తెలిపాను. ఆమె వెంటనే ఒప్పేసుకుంది. నాకు లైఫ్ లో అప్పుడు కలిగిన ఆనందం ఎప్పుడూ కలగలేదు. ఇంకా అంతా మంచిగానే జరుగుతుంది అనుకున్న సమయంలో ఆమె వేరే అబ్బాయికి దగ్గరయ్యింది. తనని పెళ్లి చేసుకునే వరకు వెళ్లింది.

కానీ ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక పోవడంతో మళ్ళీ నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. తన మీద ఉన్న ప్రేమతో నేను మారుమాట్లాడకుండా సరే అన్నాను. తరువాత మేమిద్దరం ఉద్యోగాల కోసం హైదరాబాద్‌కు వెళ్లాం. నాకు అక్కడికి వెళ్లాక ఆమె గురించి చాలా విషయాలు అర్థం అయ్యాయి. ఆమె రిచ్‌లైఫ్‌ను కోరుకుంటున్నట్లు తెలుసుకున్నాను. నన్ను వద్దు అంటుందని ఆమె ఇష్టప్రకారం నేనే ఆమెకు దూరం అయ్యాను. నేను ఇంకా జీవితంలో పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. ఆమెను తప్ప మరొకరిని నా జీవితంలో ఊహించుకోలేను. ఆమె కోరుకున్న రిచ్‌లైఫ్‌  దక్కాలి అని కోరుకుంటున్నాను.

నవీన్(విజయవాడ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement