దుర్గగుడి ఈవోగా వైవీ అనూరాధ | yv anuradha Obligations adoption as durga temple EO | Sakshi
Sakshi News home page

దుర్గగుడి ఈవోగా వైవీ అనూరాధ

Jan 8 2018 9:35 AM | Updated on Sep 29 2018 5:55 PM

yv anuradha Obligations adoption as durga temple EO - Sakshi

ఈవోగా బాధ్యతలు స్వీకరిస్తున్న కమిషనర్‌ వైవీ అనూరాధ

ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): దుర్గగుడి ఈవోగా దేవాదాయ శాఖ కమిషనర్‌ వైవీ అనూరాధ ఆదివారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు.  తొలుత ఘాట్‌రోడ్డు మీదుగా కొండపైకి చేరుకున్న వైవీ అనూరాధకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందజేసి ప్రసాదాలు ఇచ్చారు. అనంతరం ఆమె రాజగోపురం ఎదురుగా ఉన్న వీఐపీ లాంజ్‌లో ఈవోగా బాధ్యతలు స్వీకరిస్తూ ఫైల్‌పై సంతకాలు చేశారు. బ్రాహ్మణవీధిలోని ఇంద్రకీలాద్రి పరిపాలనా భవనానికి చేరుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement