టీ-20 మ్యాచ్‌లో దేశాలు దాటిన అభిమానం! | ysrcp fans waved ysrcp flags in india-zimbabwe t20 match | Sakshi
Sakshi News home page

టీ-20 మ్యాచ్‌లో దేశాలు దాటిన అభిమానం!

Jun 19 2016 12:05 AM | Updated on Jul 25 2018 4:09 PM

భారత్‌-జింబాబ్వే జట్ల మధ్య శనివారం జరిగిన టీ-20 క్రికెట్‌ మ్యాచ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అభిమానులు సందడి చేశారు.

హరారే: భారత్‌-జింబాబ్వే జట్ల మధ్య శనివారం జరిగిన టీ-20 క్రికెట్‌ మ్యాచ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అభిమానులు సందడి చేశారు. హరారేలో జరిగిన ఈ మ్యాచ్‌ సందర్భంగా మైదానంలో వైఎస్ఆర్‌సీపీ జెండాలు ప్రదర్శించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

తమ టీ షర్ట్‌లపై దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, యువనేత జగన్‌ మోహన్‌ రెడ్డి చిత్రాలను ధరించి తమ మద్దతు ప్రకటించారు. టీ-20 క్రికెట్ మ్యాచ్‌ సందర్భంగా దేశాలు దాటిన అభిమానాన్ని చాటుకుంటూ వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అభిమానులు హల్‌చల్ చేశారు. తాము విదేశాల్లో ఉన్నా.. తమకు వైఎస్‌ఆర్‌సీపీపై ఎనలేని అభిమానముందని చాటుకున్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement