లండన్లో వైఎస్సార్ అన్నదాన కార్యక్రమం | Ysr London annadhana programe at london | Sakshi
Sakshi News home page

లండన్లో వైఎస్సార్ అన్నదాన కార్యక్రమం

Aug 18 2015 10:19 PM | Updated on Jul 7 2018 3:19 PM

లండన్లో వైఎస్సార్ అన్నదాన కార్యక్రమం - Sakshi

లండన్లో వైఎస్సార్ అన్నదాన కార్యక్రమం

ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ వారి ఆద్వర్యంలో క్రీడా సాంస్కృతిక కార్యక్రమంలో దివంగత నేత, వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు మీద వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

లండన్: ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ వారి ఆధ్వర్యంలో క్రీడా  సాంస్కృతిక కార్యక్రమంలో దివంగత నేత, వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు మీద వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన 300 మందికి రుచికరమైన భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్కరు పార్టీలకతీతంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజలకు చేసిన మంచి పనులు, వారి గొప్ప నాయకత్వాన్ని స్మరించుకోవటం విశేషం.

వైఎస్సార్సీపీ యుకే & యురోప్ వింగ్ కార్యకర్తలు సందీప్ రెడ్డి వంగల, శివ కుమార్ రెడ్డి చింతం, డా. ప్రదీప్ కుమార్ రెడ్డి చింతా, అబ్బయ చౌదరి కొఠారి,  సతీష్ వనహారం, వాసుదేవ రెడ్డి మేరెడ్డి, భగవాన్ రెడ్డి , కోటి రెడ్డి కల్లం, పిసి రావు, సురేష్ రెడ్డి, ఓబుల్ రెడ్డి పాతపాటి, ప్రదీప్ కుమార్ రెడ్డి కత్తి, రవి మోచెర్ల, భాస్కర్ రెడ్డి మాలపాటి, సునీల్ రెడ్డి చవ్వా తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్ అడుగు జాడల్లో నడుస్తూ భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ వైఎస్సార్సీపీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్ల సైనికుల్లా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు లండన్లో వైఎస్సార్సీపీ కార్యకర్తలు చేస్తున్న మంచి కార్యక్రమాలను కొనియాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement