breaking news
Annadana programe
-
నిరుపేదల కోసం ‘రిలయన్స్’ ముందడుగు
ముంబై : సామాజిక సేవలో ఎప్పుడూ ముందుండే నీతా అంబానీ మరో అడుగు ముందుకేసి మిషన్ అన్న సేవ పేరుతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారీ అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారు. కరోనా ఓడిపోతుంది..ఇండియా గెలుస్తుంది అనే నినాదంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెట్ కి చెందిన రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా పేద, వలస కూలీలకు అన్నదానం చేసే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు రిలయన్స్ ఫౌండేషన్ సంస్థ వ్యవస్థాపకురాలు, ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ వెల్లడించారు. భారత్లో లాక్డౌన్ గడువును పొడిగించడంతో పేదలు, రోజువారీ కూలీల దయనీయ పరిస్థితులను చూసి చాలా బాధేసిందని అన్నారు. అందుకే వారికి ఆహారం అందించేందుకు మిషన్ అన్న కార్యక్రమాన్ని చేపట్టినట్లు ప్రకటించారు. దీని ద్వారా 3 కోట్ల మంది నిరుపేదలకు భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలోనే ఓ కార్పోరేట్ సంస్థ చేస్తున్న అతి పెద్ద అన్నదాన పంపిణీ కార్యక్రమం ఇదేనని పేర్కొన్నారు. కరోనాపై పోరులో తమవంతు సాయంగా అక్షరాల 535కోట్ల రూపాయల విరాళాన్ని అందించి దాతృత్వాన్ని చాటుకుంది రిలయన్స్ సంస్థ. -
లండన్లో వైఎస్సార్ అన్నదాన కార్యక్రమం
లండన్: ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ వారి ఆధ్వర్యంలో క్రీడా సాంస్కృతిక కార్యక్రమంలో దివంగత నేత, వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు మీద వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన 300 మందికి రుచికరమైన భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్కరు పార్టీలకతీతంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజలకు చేసిన మంచి పనులు, వారి గొప్ప నాయకత్వాన్ని స్మరించుకోవటం విశేషం. వైఎస్సార్సీపీ యుకే & యురోప్ వింగ్ కార్యకర్తలు సందీప్ రెడ్డి వంగల, శివ కుమార్ రెడ్డి చింతం, డా. ప్రదీప్ కుమార్ రెడ్డి చింతా, అబ్బయ చౌదరి కొఠారి, సతీష్ వనహారం, వాసుదేవ రెడ్డి మేరెడ్డి, భగవాన్ రెడ్డి , కోటి రెడ్డి కల్లం, పిసి రావు, సురేష్ రెడ్డి, ఓబుల్ రెడ్డి పాతపాటి, ప్రదీప్ కుమార్ రెడ్డి కత్తి, రవి మోచెర్ల, భాస్కర్ రెడ్డి మాలపాటి, సునీల్ రెడ్డి చవ్వా తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ అడుగు జాడల్లో నడుస్తూ భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ వైఎస్సార్సీపీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్ల సైనికుల్లా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు లండన్లో వైఎస్సార్సీపీ కార్యకర్తలు చేస్తున్న మంచి కార్యక్రమాలను కొనియాడారు.