ఈ కాగితంపై మళ్లీ మళ్లీ రాయొచ్చు | You can rewrite on this paper again | Sakshi
Sakshi News home page

ఈ కాగితంపై మళ్లీ మళ్లీ రాయొచ్చు

Published Sun, Dec 9 2018 2:33 AM | Last Updated on Sun, Dec 9 2018 2:34 AM

You can rewrite on this paper again - Sakshi

ఇప్పుడున్న కాగితాలు కొంత కాలానికి చిరిగిపోతాయి. వాటిపై రాతలు కొన్ని రోజులకే చెరిగిపోతాయి.  చైనా శాస్త్రవేత్తలు ఈ ఇబ్బందుల్ని తప్పించే కొత్త రకం కాగితాన్ని తయారు చేశారు. ఈ కాగితంపై మళ్లీ మళ్లీ రాసుకోవచ్చు. దీనిపై రాసింది 6 నెల్లదాకా చెక్కుచెదరదు. ఫ్యుజియన్‌ నార్మల్‌ వర్సిటీకి చెందిన లుజోహు చెన్‌ బృందం ఈ కాగితాన్ని తయారు చేసింది. ఈ కాగితం 3 పొరలుగా ఉంటుంది. ఒక వైపు పొరపై ప్రత్యేకంగా తయారు చేసిన నీలిరంగు పూస్తారు. వేడి తగలగానే ఆ రంగు మాయమై కాగితం తెల్లగా మారుతుంది.

రెండోవైపు నలుపు రంగు పూస్తారు. దీన్ని వెలుతురులో పెట్టినప్పుడు వేడిని పుట్టిస్తుంది. 65 డిగ్రీల సెల్సియస్‌కు మించిన ఉష్ణోగ్రతలో ఈ కాగితంపై నీలిరంగు వస్తూపోతూ ఉంటుంది. గది ఉష్ణోగ్రత వద్ద ఈ కాగితం తెల్లగా కనబడుతుంది. ఉష్ణోగ్రత మైనస్‌ పది డిగ్రీల కంటే తక్కువుంటే కాగితం నీలిరంగుకు మారుతుంది.వేడిని పుట్టించే ప్రత్యేకమైన పెన్నుతో ఈ కాగితంపై రాయవచ్చు.ఈ కాగితంపై వందసార్లు రాసుకోవచ్చునని చెన్‌ చెబుతున్నారు. పెన్నుతో రాసింది చెరిగిపోవాలంటే కాగితాన్ని మైనస్‌ పది డిగ్రీల సెల్సియస్‌లో ఉంచితే చాలు. ఈ కొత్తరకం కాగితాన్ని అనేక సార్లు ఉపయోగించుకునే వీలు ఉండటం వల్ల కాగితం వినియోగం గణనీయంగా తగ్గుతుందని, ఫలితంగా కాగితం తయారీ కోసం చెట్లను నరకడం తగ్గుతుందని వారు వివరిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement