యూట్యూబ్‌ స్టార్‌ అనూహ్య నిర్ణయం..

Worlds Biggest YouTube Star PewDiePie QUITS - Sakshi

న్యూయార్క్‌ : ప్రపంచవ్యాప్తంగా పేరొందిన యూట్యూబ్ స్టార్ ప్యూడీపీ వీడియో ప్లాట్‌ఫామ్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. తాను బాగా అలిసిపోయినందున యూట్యూబ్‌ నుంచి విరామం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. ప్యూడీపీగా పేరొందిన స్వీడన్‌కు చెందిన యూట్యూబ్‌ స్టార్‌ ఫెలిక్స్‌ అర్విడ్‌ జెల్‌బెర్గ్‌ యూట్యూబ్‌ నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించడంతో ఆయన అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి లోనయ్యారు. వచ్చే ఏడాది యూట్యూబ్‌ నుంచి బ్రేక్‌ తీసుకుంటున్నానని, అందుకు మానసికంగా సంసిద్ధమయ్యేందుకే దాని గురించి ఇప్పుడే ప్రకటిస్తున్నానని ప్యూడీపీ చెప్పుకొచ్చారు.

నేను పూర్తిగా అలిసిపోయా..వచ్చే ఏడాది ప్రధమార్ధంలోనే యూట్యూబ్‌ నుంచి వైదొలుగుతానని ప్రకటించారు. యూట్యూబ్‌లోనే ఫెలిక్స్‌కు 102 మిలియన్ల సబ్‌స్ర్కైబర్లు ఉండగా, తొమ్మిదేళ్ల కిందట లాంఛ్‌ చేసిన తన చానెల్‌కు 24 బిలియన్‌ వ్యూస్‌ దక్కడం గమనార్హం. ఇంతటి ప్రజాదరణ పొందడంతో వీడియోలు రూపొందించే ఫెలిక్స్‌కు నెలకు లక్షల పౌండ్ల ఆదాయం సమకూరుతోంది. ఫెలిక్స్‌కు 18 మిలియన్ల ట్విటర్‌ ఫాలోవర్లు, 20 మిలియన్ల ఇన్‌స్టా ఫాలోవర్లు ఉండటం గమనార్హం. టైమ్‌ మ్యాగజైన్‌ ప్రకటించిన ప్రపంచంలోనే వంద మంది అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో ఈ స్వీడన్‌ యూట్యూబర్‌కు చోటు దక్కింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top