
అయ్యో పాపం పప్పీ!
అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఓ కుక్క పిల్లను అన్యాయంగా చంపేస్తారా ఎవరైనా!
ఫ్లోరిడా: అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఓ కుక్క పిల్లను అన్యాయంగా చంపేస్తారా ఎవరైనా! ఫ్లోరిడాకు చెందిన సింథియా వీ ఆండర్సన్ అనే 56 ఏళ్ల ఆంటీ రెండు వారాల వయస్సు మాత్రమే కలిగిన డాబర్‌మాన్ జాతికి చెందిన కుక్క పిల్లను తీసుకొని రెండు రోజుల క్రితం నెబ్రాస్క విమానాశ్రయానికి వెళ్లింది.
ఆండర్సన్ కుక్క పిల్లను తన క్యారీ బ్యాగ్‌లో పెట్టుకొని విమానం ఎక్కేందుకు ప్రయత్నించింది. అయితే కుక్క పిల్లది మరీ చిన్న వయస్సు అవడంతో ఆ పిల్లతో విమానంలో ప్రయాణించేందుకు విమానం సిబ్బంది ససేమిరా అనుమతించలేదు. దీంతో ఏం చేయాలో పాలుపోని ఆండర్సన్ వాష్‌రూమ్‌కు వెళ్లి కుక్కపిల్లను టాయ్‌లెట్ కమోడ్‌లో పడేసి గబగబా వెళ్లి విమానం ఎక్కేసి చెక్కేసింది. ఆమె వెనకాలే వాష్‌రూమ్‌లోకి వెళ్లిన మరో మహిళ ఈ ఘోరాన్ని గమనించి విమానాశ్రయం సిబ్బందికి ఫిర్యాదు చేసింది. దర్యాప్తు కొనసాగుతోంది.