10 సెకన్లలో 60 జీబీని పంపారు! | were sent the 60 GB in 10 seconds! | Sakshi
Sakshi News home page

10 సెకన్లలో 60 జీబీని పంపారు!

May 25 2016 1:58 AM | Updated on Sep 4 2017 12:50 AM

10 సెకన్లలో 60 జీబీని పంపారు!

10 సెకన్లలో 60 జీబీని పంపారు!

వైర్లెస్ సమాచారాన్ని రేడియో తరంగాల ద్వారా వేగంగా పంపించడంలో జర్మన్ శాస్త్రవేత్తలు కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు.

బెర్లిన్: వైర్లెస్ సమాచారాన్ని రేడియో తరంగాల ద్వారా వేగంగా పంపించడంలో జర్మన్ శాస్త్రవేత్తలు కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. జర్మనీలోని స్టట్‌గార్ట్ వర్సిటీ, ఫ్రాన్‌హోఫర్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన అప్లయిడ్ సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ విభాగానికి చెందిన పరిశోధక బృందం ఈ రికార్డును సాధించారు. జర్మనీలోని వాచ్‌బెర్గ్ టౌన్‌కు కొలొగ్నె కు మధ్య దూరం 36.7 కి.మీటర్లు. ఈ బృందం రెండుప్రాంతాలకు 60 గిగాబైట్ల సమాచారాన్ని రేడియో తరంగాల ద్వారా కేవలం 10 సెకన్లలో పంపింది.

అంటే సెకనుకు 6 గిగాబైట్లా సమాచారాన్ని పంపించారు. ఇందుకు ఈ-బ్యాండుగా పిలిచే  71-76 గిగా హెట్జ్ రేడియో ఫ్రిక్వెన్సీలో ఈ సమాచారాన్ని అందించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. భవిష్యత్తులో పల్లెల్లోనూ వేగవంతమైన ఇంటర్నెట్ సేవల్ని అందుబాటులోకి తీసుకురావచ్చని పరిశోధకులంటున్నారు. 250 ఇంటర్నెట్ కనెక్షన్లు ఒక సెకనుకు 24 మెగాబైట్ల సమాచారాన్ని పంపగల్గుతాయని పరిశోధకులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement