
డైనోసార్ రోబో.. ఉసేన్ బోల్ట్ కన్నా స్పీడు..
రాప్టర్ అనే ఈ రోబో జమైకా పరుగుల చిరుత ఉసేన్ బోల్ట్ కన్నా వేగంగా పరుగెత్తుతుందట. బోల్ట్ పరుగెత్తే గరిష్టవేగం గంటకు 43.92 కిలోమీటర్లు.
రాప్టర్ అనే ఈ రోబో జమైకా పరుగుల చిరుత ఉసేన్ బోల్ట్ కన్నా వేగంగా పరుగెత్తుతుందట. బోల్ట్ పరుగెత్తే గరిష్టవేగం గంటకు 43.92 కిలోమీటర్లు. కాగా.. ఇది గంటకు 46 కి.మీ. వేగంతో ట్రెడ్‌మిల్‌పై పరుగులు పెట్టిం దట. తోకను బ్యాలెన్స్ కోసం వాడుకుంటూ వేగంగా పరుగెత్తే వెలోసిరాప్టర్ అనే రాక్షసబల్లిని ప్రేరణగా తీసుకుని కొరియా అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు దీనిని రూపొం దించారు.
ట్రెడ్‌మిల్‌పై అడ్డంకులుగా వస్తువులను వేసినా ఇది వాటిని తొక్కకుండా, తూలిపడకుండా కూడా పరుగెత్తుతుం దట. అయితే అతివేగంగా పరుగెత్తిన రికార్డు మాత్రం బోస్టన్ శాస్త్రవేత్తలు తయారు చేసిన చీతా అనే రోబోపైనే ఉంది. అది గతేడాది గంటకు 47 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తింది.