అమెరికా రక్షణ మంత్రిగా ఆస్టన్ కార్టర్‌ను దేశాధ్యక్షుడు ఒబామా శుక్రవారం ప్రకటించారు.
వాషింగ్టన్: అమెరికా రక్షణ మంత్రిగా ఆస్టన్ కార్టర్‌ను దేశాధ్యక్షుడు ఒబామా శుక్రవారం ప్రకటించారు. ఒబామాకు సన్నిహితుడు, భారత్‌కు మద్దతుదారు అయిన కార్టర్ ఎంపికతో, భారత్, అమెరికా రక్షణ సంబంధాలపై ఒబామా మరింత వ్యక్తిగత శ్రద్ధ చూపే అవకాశముంది. అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కేంద్రమైన పెంటగాన్‌లో వివిధ హోదాల్లో కార్టర్ గతంలో పనిచేశారు.