శ్రీలంక ఆర్మీచీఫ్‌పై అమెరికా నిషేధం

US Bans Sri Lanka Army Chief Shavendra Silva From Entry - Sakshi

వాషింగ్టన్‌: శ్రీలంక ఆర్మీ చీఫ్‌ షవేంద్ర సిల్వను అమెరికాలోకి అనుమతించబోమని ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో చెప్పారు. 2009 అంతర్యుద్ధంలో భారీగా మానవహక్కుల ఉల్లంఘనలకు అతడు పాల్పడినట్లు తమ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఆయా ఆధారాలను ఐక్యరాజ్యసమితి సహా పలు సంస్థలు కూడా గుర్తించాయని అన్నారు. షవేంద్రతో పాటు అతడి కుటుంబ సభ్యులు కూడా అమెరికాలో ప్రవేశించేందుకు అనర్హులని చెప్పారు. శాంతిని, మానవ హక్కులను పెంపొందించాలంటూ శ్రీలంక ప్రభుత్వానికి అమెరికా సూచించింది. (చదవండి: సీక్రెట్‌ చెప్పేసిన ప్రపంచ కురు వృద్దుడు)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top