అమెరికా రాయబారిపై కత్తితో దాడి | US ambassador to South Korea injured by knife-wielding attacker | Sakshi
Sakshi News home page

అమెరికా రాయబారిపై కత్తితో దాడి

Mar 5 2015 1:23 PM | Updated on Aug 24 2018 6:33 PM

అమెరికా రాయబారిపై కత్తితో దాడి - Sakshi

అమెరికా రాయబారిపై కత్తితో దాడి

సౌత్ కొరియా లోని అమెరికా రాయబారి మార్క్ లిప్పర్ట్ పై ఒక దుండగుడు కత్తితో దాడి చేశాడు.

సౌత్ కొరియా: సౌత్ కొరియా లోని అమెరికా రాయబారి మార్క్ లిప్పర్ట్ పై   ఓ దుండగుడు  కత్తితో దాడి చేశాడు.  ఉదయం  బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ లో  వుండగా   జరిగిన ఈ దాడిలో లిప్పర్ట్  ముఖంపై చేతిపై తీవ్ర గాయాలయ్యాయి.  హుటాహుటిన లిప్పర్ట్ ను ఆసుపత్రికి తరలించారు.  కాగా లిప్పర్ట్  ప్రాణానికేమీ ప్రమాదం లేదని  వైద్యులు  తెలిపారు.  మరోవైపు భద్రతా సిబ్బంది దాడి చేసిన దుండగుడిని  అదుపులోకి తీసుకున్నారు.


కాగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఆయన లిప్పర్ట్ తో ఫోన్ లో మాట్లాడారు.  త్వరగా కోలుకోవాలని ఒబామా ఆకాంక్షించారు. ఈ దాడిని  సౌత్  కొరియా- అమెరికా  మైత్రిపై జరిగిన  దాడిగా  సౌత్ కొరియన్ ప్రెసిడెంట్  అభివర్ణించారు.మరోవైపు  ఉత్తర, దక్షిణ కొరియా ఏకంకావాలంటూ   దుండగుడు  నినాదాలు చేసినట్టుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement