
లండన్ : లాక్‌డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర అవసరాల మినహా బయటికి రావడంలేదు. సినిమాలు చూస్తూ, కొత్త వంటలు ప్రయోగిస్తున్నా కొందరికి కాలక్షేపం కావట్లేదు. దీంతో ప్రజలకు కాస్త ఎంటర్‌టైన్‌మెంట్ ఇద్దామనుకున్నాడు లండన్‌లోని ఓ వ్యక్తి. వేమౌత్‌కు చెందిన రాయల్ మెరైన్ తన కుక్కలను బయటకి తీసుకొచ్చేటప్పడు వెరైటీగా డ్రెస్ చేసుకుంటున్నాడు. దీంతో అతడ్ని చూసిన జనం సంబరపడిపోతున్నారు. వారి ముఖంలో సంతోషాలు తీసుకొచ్చేందుకు ఈ చిన్న ప్రయత్నం అంటూ మెరైన్ స్నేహితుడు జాక్ అతని ఫోటోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడంతో అవి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
మెరైన్ ఒక్కోరోజు ఒక్కో విధమైన దుస్తులను ధరిస్తూ అక్కడున్నవారిని ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. ఒకరోజు పింక్ క్రాప్‌టాప్‌లో దర్శనమిస్తే మరోరోజు వారియర్ గెటప్‌లో కనిపించి అక్కడున్న వారికి కావల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నాడు. మెరైన్ వేషదారణకు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. ఆ గెటప్‌లు ఏంటో మీరూ చూసేయండి.