టాప్ 100 హాట్ బ్యూటీలలో మనోళ్లు ఇద్దరు! | two of bollywood heroines listed in top 100 hot beauties of maxim | Sakshi
Sakshi News home page

టాప్ 100 హాట్ బ్యూటీలలో మనోళ్లు ఇద్దరు!

May 31 2017 5:44 PM | Updated on Apr 3 2019 6:34 PM

టాప్ 100 హాట్ బ్యూటీలలో మనోళ్లు ఇద్దరు! - Sakshi

టాప్ 100 హాట్ బ్యూటీలలో మనోళ్లు ఇద్దరు!

ప్రపంచంలోనే అత్యంత హాట్ బ్యూటీ ఎవరని ఒక పోల్ జరిగింది. మాగ్జిమ్ అనే పత్రిక ఈ పోల్ నిర్వహించింది.

ప్రపంచంలోనే అత్యంత హాట్ బ్యూటీ ఎవరని ఒక పోల్ జరిగింది. మాగ్జిమ్ అనే పత్రిక ఈ పోల్ నిర్వహించింది. 2017 సంవత్సరానికి గాను ప్రపంచంలోనే టాప్ 100 హాట్ బ్యూటీలను ఎంపిక చేసింది. ఆ లిస్టులో అందరికంటే అగ్రస్థానంలో ప్రముఖ మోడల్ హెయిలీ బాల్డ్‌విన్ నిలిచింది. టాప్ 100 జాబితాలో బాలీవుడ్ భామలు దీపికా పడుకొనే, ప్రియాంకా చోప్రా కూడా నిలిచారు. ఇంకా ఈ జాబితాలో ఎమ్మా వాట్సన్, ఎమ్మా స్టోన్, డకోటా జాన్సన్, కెండల్ జెన్నర్ తదితరులు చాలా మంది ఉన్నారు.

హాలీవుడ్‌లో నటించిన తొలి సినిమా ట్రిపుల్ ఎక్స్‌తోనే దీపికకు బ్రహ్మాండంగా ప్రశంసలు లభించాయి. ఇక ప్రియాంకా చోప్రా కూడా క్వాంటికో అనే అమెరికన్ టీవీ సిరీస్‌తో హాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఈ వారంలోనే ఆమె తొలిసారిగా నటించిన బేవాచ్ సినిమా కూడా రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement