అభిమానం హద్దులు మీరి దురాభిమానంగా మారడంతో రెండు ప్రాణాలను బలికొంది. సరదా కోసం ఆడిన ఫుట్బాల్ మ్యాచ్ విషాదాన్ని మిగిల్చింది.
అభిమానం హద్దులు మీరి దురాభిమానంగా మారడంతో రెండు ప్రాణాలను బలికొంది. సరదా కోసం ఆడిన ఫుట్బాల్ మ్యాచ్ విషాదాన్ని మిగిల్చింది. రెండు ఫుట్బాల్ జట్ల అభిమానుల మధ్య ఘర్షణ చెలరేగడంతో ఇద్దరు మరణించగా, మరో ఐదు మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన శనివారం బ్రెజిల్లో జరిగింది.
నటాల్ నగరంలో రెండు స్థానిక జట్లు ఎబీసీ, ఏఎస్ఏ మధ్య జరిగిన మ్యాచ్కు అభిమానులు భారీగా హాజరయ్యారు. మ్యాచ్ ముగిసే దశలో ఇరు జట్ల అభిమానులు పరస్పరం గొడవకు దిగారు. ఇది తీవ్ర రూపం దాల్చడంతో అభిమానులు కాల్పులు జరుపుకొన్నారు. ఫ్లావియో (17), ఇస్మాయిల్ (18) మరణించారు. వచ్చే ఏడాది బ్రెజిల్లో ఫుట్బాల్ ప్రపంచ కప్ జరగాల్సివుంది. తాజా సంఘటన నేపథ్యంలో శాంతి భద్రతలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.