నీళ్ల పైపులో నివాసం.. విలాసవంతమైన ఇళ్లు! | Sakshi
Sakshi News home page

Published Thu, Feb 1 2018 8:36 PM

tube homes in hong kong - Sakshi

నీళ్ల పైపులో ఎక్కడైనా నివాసముంటారా? అందులో విలాసవంతమైన ఇళ్లు కూడా ఉంటాయ? అని విస్తుపోతున్నారా? ఔను.. నిజమే నీళ్లపైపులోనూ హాయిగా నివాసముండవచ్చునని ఓ హాంగ్‌కాంగ్‌  ఆర్కిటెక్చర్‌ నిరూపించారు. ఆయన తాజాగా ట్యూబ్‌ హోమ్స్‌ సృష్టించారు. ఇవి మాములు ఇళ్లు కావు.. విలాసవంతమైన హంగులతో, కేవలం 8.2 అడుగుల వెడల్పుతో ఉండే ఈ ఇళ్లు. ఇందులోని సోఫానే  మంచంగా కూడా వాడుకోవచ్చు, షవర్‌తో కూడిన బాత్‌రూం కూడా ఇందులో అందుబాటులో ఉంటుంది. అయినా శుభ్రంగా ఇల్లు కట్టుకోక.. ఎందుకు ఈ ఇరుకు పైపుల్లో అంటారా?  హంగ్‌ కాంగ్‌లో పెరిగిపోతున్న జనాభాకు సరిపడా ఇళ్లు లేవు. ఈ సమస్యను అధిగమించాడానికే జేమ్స్‌ లా అనే వ్యకి వీటిని రూపొందించారు. ఈయనో పెద్ద ఆర్కిటెక్‌..

సౌకర్యాలు...
ఈ పైపు ఇంట్లో విలాసవంతమైన సౌకర్యాలకు ఏం కొదవ లేదు.  ఈ చిన్ని ఇంట్లో కూర్చోడానికి సోఫా ఉంటుంది. మడత తీస్తే అదే మంచంగా ఒదిగిపోతుంది. దాంతోపాటు మిని ఫ్రీజ్‌ కుడా ఉంది. ఇంకా స్నానం చేయడానికి షవర్‌తో కూడిన బాత్‌రూం అందుబాటులో ఉంది. ప్రశాంతంగా సోఫాలో కుర్చోని టీవీ కూడా చూసేయొచ్చు.

ఉపయోగాలు..
ఈ ట్యూబ్‌ హోమ్స్‌తో  చాలా ప్రయోజనాలే ఉన్నాయంటున్నారు జేమ్స్‌ లా. హంగ్‌ కాంగ్‌లో జనాభా పెరిగిపోయింది. ఉండాటానికి ఇళ్లు సరిపడా లేవు. ఉన్నా వాటిని కొనుగోలు చేయాలంటే.. చాలా ఖరీదుతో కూడిన వ్యవహరం. చాలా మంది ఇల్లు కట్టుకోలేక, అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్నారు. అక్కడ అద్దె కుడా చాలా ఎక్కువ. చాలా మంది ప్రజలు ఇరుకైన ఇళ్లలో అధిక అద్దెను చెల్లిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. అలాంటి వారి కోసం, దేశంలోని నివాసాల కొరతను తగ్గించడానికే తను ఈ ట్యూబ్‌ ఇళ్లను కనిపెట్టినట్టు చెబుతున్నారు జేమ్స్‌ లా.

మరీ ధర సంగతి..
ఈ చిన్న చిన్న ఇళ్లు మధ్య తరగతి ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయని, వీటి ధర కుడా చాలా చౌకేనని అంటున్నారు వీటి రూపకర్త జేమ్స్‌ లా.  వీటి ధర 15000 డాలర్లు మాత్రమే. సాధారణంగా హంగ్‌ కాంగ్‌లో ఒక ఇల్లు కట్టుకోవాలంటే దాదాపు 1.8 మిలియన్‌ డాలర్లు ఖర్చు అవుతుంది. దాంతో పోల్చి చూస్తే ఇది చాలా చౌక.

వీటిని ఎక్కడా కట్టుకోవచ్చు?
ఈ ట్యూబ్‌ హోమ్స్‌ నిర్మించే ఒక్కో పైపు బరువు 22 టన్నులు ఉంటుంది. వీటిని ఒక దానిపై ఒకటి పెట్టుకోవచ్చు. అలా పెట్టేటప్పుడు వాటికి బోల్ట్‌ కూడా బిగించాల్సిన అవసరం లేదు. పనికిరాని ప్రదేశాలలో, భవనాల మధ్య ఖాళీ స్థలంలో, హైవే ఫ్లైఓవర్ల కింద, బ్రిడ్జిల కింద కుడా వీటిని అమర్చవచ్చు. అధికారుల నుంచి అనుమతులు రాగానే వీటిని తయారుచేసి విక్రయిస్తాం అన్నారు. ఇప్పటికైతే ఈ పైపు ఇల్లు నమునాగానే ఉన్న భవిష్యత్తులో నిజం కాబోతుంది.

ట్యూబ్‌ హోమ్స్‌కు సంబంధించిన కొన్ని చిత్రాలు మీకోసం..

1/6

2/6

3/6

4/6

5/6

6/6

Advertisement
Advertisement