వచ్చె నెల్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధిస్తారని..
న్యూయార్క్: వచ్చె నెల్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధిస్తారని.. యూఎస్ ప్రఖ్యాత ఎన్నికల నిపుణుడు హెల్మట్ నార్‌పోత్ స్పష్టం చేశారు. ఈయన మోడల్ ప్రకారం ప్రైమరీలు, కాకసెస్ (ఆ పార్టీలోని ఎన్నికైన సభ్యులు)లో మెజారిటీ సంపాదించిన బలమైన నేత శ్వేతసౌధానికి ఎంపికవుతారు.
ఈ మోడల్‌కు మారుతున్న రాజకీయ, అంతర్జాతీయ పరిస్థితులతో సంబంధం ఉండదు. రిపబ్లికన్ పార్టీలో ట్రంప్ ప్రైమరీలు, కాకసెస్‌లో పార్టీపరంగా బలమైన నేతగా ఎదిగారు. ఆ తర్వాత పార్టీలో వ్యతిరేకత ఎదురైనా ఇది ట్రంప్ విజయంపై ప్రభావం చూపదని హెల్మట్ తెలిపారు. ఈ మోడల్ ప్రకారం 1912 నుంచి ఒబామా వరకు (2000లో తప్ప) అన్ని అంచనాలు నిజమయ్యాయి.