మా బంధం అత్యంత ప్రత్యేకం

Trump meets with PM May after shocking British tabloid interview - Sakshi

బ్రిటన్‌ పర్యటనలో ట్రంప్‌ వ్యాఖ్య

లండన్‌: అమెరికా–బ్రిటన్‌ల బంధం విడదీయరానిదనీ, చాలా ప్రత్యేకమైనదని అమెరికా అధ్యక్షుడు  ట్రంప్‌ అన్నారు. బ్రిటన్‌ ప్రధాని థెరెసా మే అనుసరిస్తున్న బ్రెగ్జిట్‌ వ్యూహాన్ని గతంలో విమర్శించిన ట్రంప్‌ తాజాగా మాట మార్చారు. మే బ్రెగ్జిట్‌ విధానాలు.. అమెరికా, బ్రిటన్‌ల మధ్య కుదరాల్సిన వాణిజ్య ఒప్పందాన్ని ‘చంపేసేలా’ ఉన్నాయని ట్రంప్‌ మూడ్రోజుల క్రితం ‘ద సన్‌’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

అయితే ద సన్‌ ప్రతిక ప్రచురించిందంతా అబద్ధమని, అదో ‘ఫేక్‌ న్యూస్‌’ (నకిలీ వార్తలు) పత్రిక అని ట్రంప్‌ ఆరోపించారు. 4 రోజుల పర్యటన కోసం ట్రంప్‌ తొలిసారిగా బ్రిటన్‌ వచ్చారు. చర్చల తర్వాత ట్రంప్, థెరెసా మీడియాతో మాట్లాడారు. ‘బ్రెగ్జిట్‌ చాలా సంక్లిష్టమైంది. బ్రిటన్‌ ఏం చేసినా అమెరికాతో వ్యాపారం కొనసాగిస్తే చాలు’ అని ట్రంప్‌ అన్నారు. ట్రంప్‌  పర్యటనకు వ్యతిరేకంగా లండన్‌లో నిరసనలు చోటు చేసుకున్నాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top