ట్రంప్‌- కిమ్‌ చరిత్రాత్మక భేటీ

Trump-Kim summit in Singapore has Started - Sakshi

సింగపూర్‌: ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న అపురూప, అరుదైన సమావేశానికి సింగపూర్‌ వేదికైంది. సెంటసో ద్వీపంలోని కెపెల్లా ద్వీపంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్‌ల మధ్య శిఖరాగ్ర సమావేశం మంగళవారం ఉదయం భేటీ అయ్యారు. కొద్ది నెలల క్రితం వరకూ పరస్పరం తిట్టిపోసుకున్న ఈ ఇద్దరు నేతలు కీలక చర్చలు జరిపారు. ఉత్తర కొరియాను అణునిరాయుధీకరణకు ఒప్పించడమే ప్రధాన ఎజెండాగా సింగపూర్‌లోని కపెల్లా హోటల్లో అమెరికా, ఉ.కొరియా అధినేతల మధ్య ఈ శిఖరాగ్ర సమావేశం జరిగింది. దాదాపు 48 నిమిషాలపాటు ట్రంప్‌, కిమ్‌ మధ్య చర్చలు జరిగాయి. అణ్వాయుధాల విషయంలో కిమ్‌తో ట్రంప్‌ చర్చించారు. అణ్వాయుధాలను వీడాలని, అణు నిరాయుధీకరణకు ఉత్తర కొరియా సహకరించాలని ట్రంప్‌ కిమ్‌కు సూచించారు. ఇందుకు అంగీకరిస్తే.. ఉత్తర కొరియా భద్రతకు హామీ ఇస్తామని, దీనితోపాటు ఆర్థిక సాయం అందిస్తానని ట్రంప్‌ ఆఫర్‌ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కిమ్‌ ఏ నిర్ణయం తీసుకుంటారన్నదని ఆసక్తికరంగా మారింది. మొదట ఏకాంత చర్చల అనంతరం ఇరుదేశాల దౌత్యనేతలతో అధ్యక్షులు సమావేశం అయ్యారు.

  • యుద్ధం ముగింపునకు అధికార ప్రకటన చేయని ఇరుదేశాలు
  • దౌత్యం దిశగా కదలకపోతే ఉత్తర కొరియాపై మరిన్ని ఆంక్షలు విధించే ఆలోచనలో అగ్రదేశం
  • ప్రత్యేక హామీలు ఇచ్చేందుకు అమెరికా సంసిద్ధత
  • ఆర్థిక వ‍్యవస్థను బలోపేతం చేయాలనే ఉద్ధేశంలో కిమ్‌
  • ట్రంప్‌ కిమ్ భేటీలో ప్రస్తావనకు రానున్న అనేక అంశాలు
  • అనంతరం ఇరుదేశాల ప్రతినిధి బృందాలతో సమావేశం
  • విభేదాలను రూపుమాపేందుకు ఇరు దేశాల అధ్యక్షుల మధ్య సుదీర్ఘ చర్చలు
     

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top