భారీ వర్షాలు : 114కు పెరిగిన మృతులు | Toll rises to 114 in China rains | Sakshi
Sakshi News home page

భారీ వర్షాలు : 114కు పెరిగిన మృతులు

Jul 24 2016 7:59 AM | Updated on Sep 4 2017 6:04 AM

భారీ వర్షాలు : 114కు పెరిగిన మృతులు

భారీ వర్షాలు : 114కు పెరిగిన మృతులు

చైనాలోని హీబీ ప్రావిన్స్ భారీ వర్షాలు, వరదతో అతలాకుతలం అవుతుంది.

బీజింగ్: చైనాలోని హీబీ ప్రావిన్స్ భారీ వర్షాలు, వరదతో అతలాకుతలం అవుతుంది. ఈ ప్రావిన్స్ లో భారీ వర్షాలతో మృతి చెందిన వారి సంఖ్య 114కు పెరిగింది. అలాగే 111 మంది గల్లంతు అయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఆదివారం వెల్లడించారు. దాదాపు 3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. వర్షాలు, వరదల కారణంగా దాదాపు 52,900 ఇళ్లు కుప్పకూలాయని... అలాగే 15,5000 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.

సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. సైనికులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టినట్లు వివరించారు. దాదాపు 1200 మంది ప్రజల సహకారంతో సహాయక చర్యలు తీవ్రతరం చేసినట్లు చెప్పారు. వరద ముంపునకు గురైన గ్రామాల్లో స్థానికంగా నెలకొన్న పరిస్థితిని అంచనా వేసేందుకు 15 బృందాలను ఏర్పాటు చేసినట్లు ఉన్నతాధికారులు విశదీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement