అయ్యారే.. ఆఫీసు! | the office of the china | Sakshi
Sakshi News home page

అయ్యారే.. ఆఫీసు!

May 24 2015 8:34 AM | Updated on Sep 3 2017 2:34 AM

అయ్యారే.. ఆఫీసు!

అయ్యారే.. ఆఫీసు!

ఆకాశంలోని అంతరిక్ష నౌక నేలపైకి దిగినట్టుందే అనుకుంటున్నారా?

హైదరాబాద్:  ఆకాశంలోని అంతరిక్ష నౌక నేలపైకి దిగినట్టుందే అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే! కింది చిత్రంలో కనిపిస్తోంది అంతరిక్ష నౌకే. పేరు స్టార్ ట్రెక్. దీని డిజైన్ చైనాలో బాగా డబ్బులున్న ఓ పెద్దాయనకు తెగ నచ్చేసింది. అంతే తన కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని ఇదే నమూనాలో కట్టించుకోవాలని తలపోశాడు. అచ్చంగా అదే డిజైన్‌లో తన ఆఫీసును కట్టించేసుకున్నాడు (పై చిత్రం). ముచ్చటపడి కట్టించుకున్న ఈ నిర్మాణానికి ఎంత ఖర్చు చేశాడో తెలుసా? అక్షరాలా రూ.983 కోట్లు!!

మూడు ఫుట్‌బాల్ కోర్టుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆఫీసు నిర్మాణాన్ని 2008లో మొదలుపెట్టి 2014లో పూర్తిచేశారు. చైనాలో ఆన్‌లైన్ గేమ్స్, మొబైల్ అప్లికేషన్లు రూపొందించే ఇంటర్నెట్ దిగ్గజం ‘నెట్‌డ్రాగన్ వెబ్‌సాఫ్ట్’ సంస్థ అధినేత ల్యూ డిజియాన్ దీన్ని కట్టించాడు. ఈ ‘భూఅంతరిక్ష నౌక’ను చూడాలంటే ఫుజియాన్ రాష్ట్రానికి వెళ్లాల్సిందే!

Advertisement

పోల్

Advertisement