కాల్పులు, పేలుళ్లతో విరుచుకుపడ్డ ఉగ్రవాదులు | Terrorist Attack on Burkina Faso Capital Ouagadougou | Sakshi
Sakshi News home page

బుర్కినా ఫాసోలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు

Mar 2 2018 5:38 PM | Updated on Mar 2 2018 8:27 PM

Terrorist Attack on Burkina Faso Capital Ouagadougou - Sakshi

ఉగ్రవాదుల దాడి దృశ్యాలు

వాగాదువో : పశ్చిమ ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసో ఉగ్రదాడితో ఉలిక్కిపడింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం నుంచి రాజధాని వాగాదువో నగరంలో ఉగ్రవాదులు విరుచుకుపడుతున్నారు.

కారులో వచ్చిన ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులకు, బాంబు దాడులకు పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మరోవైపు ఆర్మీ హెడ్‌ క్వార్టర్స్‌తోపాటు ఫ్రాన్స్‌ రాయబార కార్యలయంపై దాడి జరిగినట్లు అధికారులు ధృవీకరించారు. ప్రజలంతా సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచిస్తున్నారు.రంగంలోకి దిగిన సైన్యం ఉగ్రవాదులను మట్టుపెట్టే ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం.

మరోవైపు అమెరికా రాయబార కార్యలయం కూడా ఉగ్రదాడిని ట్విట్టర్‌లో తెలియజేసింది. కాగా, రెండేళ్ల క్రితం నగరంలోని ఓ టర్కీస్‌ రెస్టారెంట్‌లోకి చొరబడ్డ ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి 17 మందిని పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement