'చనిపోతున్నా.. అందరికీ బై' | Terminally Ill 28-Year-Old Explains Her Decision to Die in Devastating Goodbye Post | Sakshi
Sakshi News home page

'చనిపోతున్నా.. అందరికీ బై'

Jan 1 2016 4:50 PM | Updated on Sep 3 2017 2:55 PM

'చనిపోతున్నా.. అందరికీ బై'

'చనిపోతున్నా.. అందరికీ బై'

ఊపిరితిత్తుల సమస్య కారణంగా ఏడాదికిపైగా ఆస్పత్రిలో చికిత్స పొందిన ఓ యువతి జీవితం విషాదాంతమైంది.

ఊపిరితిత్తుల సమస్య కారణంగా ఏడాదికిపైగా ఆస్పత్రిలో చికిత్స పొందిన ఓ యువతి జీవితం విషాదాంతమైంది. ఊపిరితిత్తుల మార్పిడి చేసినా ఆరోగ్యం మెరుగుకాదని వైద్యులు చెప్పడంతో విరక్తి చెందిన ఆమె.. 'చనిపోవాలని నిర్ణయించుకున్నా.. అందరికీ బై' అంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. చికిత్సను నిరాకరించి కుటుంబ సభ్యుల మధ్య కన్నుమూసింది. ఇంగ్లండ్లోని సౌత్వేల్స్కు చెందిన 28 ఏళ్ల కిర్స్టీ బ్రిడ్జెస్ విషాద జీవిత కథ ఇది.  

బ్రిడ్జెస్ చిన్నతనం నుంచే ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతోందని ఆమె తల్లి చెప్పారు. సమస్య తీవ్రంకావడంతో ఏడాది నుంచి ఆస్పత్రిలోనే చికిత్స పొందుతోంది. అయితే ఆరోగ్యం మెరుగయ్యే అవకాశం లేదని వైద్యులు చెప్పడంతో బ్రిడ్జెస్ తీవ్ర నిర్ణయం తీసుకుంది. బ్రిడ్జెస్ ఫేస్బుక్ పోస్ట్ చూసి వందలాది మంది ఫాలోవర్స్ స్పందించారు. చనిపోవాలన్న నిర్ణయాన్ని మార్చుకోవాలని, చికిత్స చేయించుకోవాలని కోరారు. అయినా బ్రిడ్జెస్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల తర్వాత అన్ని రకాల చికిత్సలను ఆపివేసింది. ఆస్పత్రిలోనే కుటుంబ సభ్యుల సమక్షంలో చనిపోయింది. డిసెంబర్ చివర్లో ఈ ఘటన జరిగింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement