'స్కూల్కు బాంబు తీసుకువచ్చావా?' | Teacher Asks 13-Year-Old Muslim Student If She Has A Bomb | Sakshi
Sakshi News home page

'స్కూల్కు బాంబు తీసుకువచ్చావా?'

Dec 14 2015 8:30 AM | Updated on Apr 4 2019 3:25 PM

'స్కూల్కు బాంబు తీసుకువచ్చావా?' - Sakshi

'స్కూల్కు బాంబు తీసుకువచ్చావా?'

అమెరికాలో 13 ఏళ్ల ముస్లిం విద్యార్థినికి స్కూల్లో అవమానకర సంఘటన ఎదురైంది.

అట్లాంటా: అమెరికాలో 13 ఏళ్ల ముస్లిం విద్యార్థినికి స్కూల్లో అవమానకర సంఘటన ఎదురైంది. జార్జియాలోని ఓ స్కూల్లో టీచర్.. 'బ్యాగ్లో బాంబు తీసుకువచ్చావా' అని తన కుమార్తెను ప్రశ్నించినట్టు విద్యార్థిని తండ్రి అబ్దిరిజాక్ ఆడెన్ చెప్పాడు. ఈ ఘటనపై స్కూల్ ప్రిన్సిపాల్ క్షమాపణలు చెప్పారు.

స్కూల్లో టీచర్ తన కుమార్తెను ఆపి 'మానవబాంబా' అని ప్రశ్నించారని, దీంతో తన కుమార్తె ఎంతో బాధపడిందని ఆడెన్ వెల్లడించాడు. ఈ విషయం తెలియగానే స్కూల్ నుంచి తన కుమార్తెను తీసుకువచ్చానని తెలిపాడు. 'మేం ఆఫ్రికా నుంచి వచ్చి అమెరికాలో నివసిస్తున్నాం. మేం ముస్లిం మతానికి చెందినవారం. ఇతరులను ద్వేషించాలని నేను పిల్లలకు చెప్పలేదు. ఇతరుల కంటే గొప్పని కూడా చెప్పలేదు' అని ఆడెన్ చెప్పాడు. ఈ ఘటనపై స్కూల్ ప్రిన్సిపాల్ స్పందిస్తూ విచారం వ్యక్తం చేశారు. విద్యార్థిని కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement