సదరన్ జపాన్ ను భారీ భూకంపం గురువారం రాత్రి కుదిపేసింది.
సదరన్ జపాన్ లో భారీ భూకంపం
Mar 14 2014 12:19 AM | Updated on Sep 2 2017 4:40 AM
టోక్యో: సదరన్ జపాన్ ను భారీ భూకంపం గురువారం రాత్రి కుదిపేసింది. సదరన్ జపాన్ లోని క్యూషూ దీవుల్లో భూకంపం సంభవించిందని అమెరికా జియాలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.3 గా నమోదైంది. అయితే ఎలాంటి సునామీ హెచ్చరికల్ని జారీ చేయలేదు. జపాన్ కాలమానం ప్రకారం గురువారం అర్దరాత్రి 2.06 నిమిషాలకు సంభవించినట్టు సమాచారం. 2011 సంభవించిన భూకంప ప్రమాదంలో 18 వేల మంది మరణించిన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement