అంతరిక్ష కేంద్రం నుంచి క్షేమంగా భూమికి..

Soyuz Capsule Returns Station Crew to Earth After 204 Days in Space - Sakshi

జెజ్కాజ్‌గన్‌: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి ముగ్గురు వ్యోమగాములు భూమికి క్షేమంగా చేరుకున్నారు. నాసా వ్యోమగామి అన్నే మెక్‌క్లయిన్, రష్యన్‌ వ్యోమగామి ఒలెగ్‌ కొనోనెన్కో, కెనడియన్‌ స్పేస్‌ ఏజెన్సీ వ్యోమగామి సెయింట్‌ జాక్వస్‌లు కజఖ్‌ సిటీ సమీపంలో మంగళవారం పారాచూట్‌ సాయంతో సురక్షితంగా భూమిపై అడుగుపెట్టారు. రష్యన్‌ అంతరిక్ష కార్యక్రమంలో భాగంగా  సోయుజ్‌ రాకెట్‌లో ఈ ముగ్గురు అంతరిక్ష కేంద్రానికి డిసెంబర్‌ 3న వెళ్లారు. అంతకుముందు అక్టోబర్‌లో రష్యా, అమెరికాకు చెందిన వ్యోమగాములు అలెస్కీ, నిక్‌ హాగ్‌లను తీసుకెళ్లేందుకు సోయుజ్‌ రాకెట్‌ బయలుదేరింది. అయితే ప్రయోగించిన నిమిషాల్లోనే కొన్ని సమస్యల కారణంగా వారిద్దరు అత్యవసరంగా భూమిపై ల్యాండయ్యారు. ఇక ఎక్కువ రోజులు అంతరిక్షంలో గడిపిన మొదటి కెనడా వ్యోమగామిగా సెయింట్‌ జాక్వస్‌ రికార్డు సృష్టించారు.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top