విమానంలో పాము దర్శనమిచ్చింది. విమాన సిబ్బంది దీనిని గుర్తించారు. దీంతో ఒమన్ నుంచి దుబాయ్ వరకు వెళ్లాల్సిన ఎమిరేట్స్ విమానాన్ని ఆపేశారు.
దుబాయ్: విమానంలో పాము దర్శనమిచ్చింది. విమాన సిబ్బంది దీనిని గుర్తించారు. దీంతో ఒమన్ నుంచి దుబాయ్ వరకు వెళ్లాల్సిన ఎమిరేట్స్ విమానాన్ని ఆపేశారు. సోమవారం ఉదయం మస్కట్ నుంచి బయలుదేరాల్సిన ఎమిరేట్స్‌కు చెందిన ఈకే0863 విమానంలో వస్తువులు పెట్టే కార్గో విభాగం చోట సిబ్బందికి పాము కనిపించింది.
అయితే, అప్పటికే ఇంకా ప్రయాణీకులు విమానం ఎక్కలేదు. దీంతో ఆ విమానాన్ని అప్పటికప్పుడు రద్దు చేసి అందులో సోదాలు నిర్వహించి పామును పట్టుకున్నారు. అనంతరం కొన్ని గంటల ఆలస్యం తర్వాత ఆ విమానం దుబాయ్‌కు చేరుకుంది. అయితే అందులో దొరికిన పాము ఏ జాతిదనే విషయం మాత్రం అధికారులు చెప్పలేదు. గతంలో కూడా ఇలా విమానాల్లో పాములు కనిపించి గందరగోళ పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే.