ల్యాండ్ అవుతుండగా కుప్పకూలిన విమానం.. | Small plane crash kills three in US | Sakshi
Sakshi News home page

ల్యాండ్ అవుతుండగా కుప్పకూలిన విమానం..

Jun 10 2016 8:38 AM | Updated on Jul 29 2019 5:43 PM

ఓ విమానం కుప్పుకూలిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు.

వాషింగ్టన్: ఓ విమానం కుప్పుకూలిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. అమెరికాలోని హౌస్టన్ హాబీ ఎయిర్ పోర్ట్ సమీపంలో గురువారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. సిర్రస్ గ్రూప్ డిజైన్ చేసిన సింగిల్ ఇంజిన్ విమానం పార్కింగ్ చేస్తుండగా ల్యాండ్ అయ్యే సమయంలో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. మోడల్ ఎస్ఆర్20 విమానం గట్టిగా శబ్ధం చేస్తూ అకస్మాత్తుగా పేలిపోయిందని ఆ సమయంలో అందులో ఉన్న వారు చనిపోయారని ప్రత్యక్ష సాక్షి చెప్పాడు. ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్ పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఘటనకు సంబంధించిన కారణాలు ఇంకా తెలియరాలేదని ఎయిర్ పోర్ట్ అధికారులు వెల్లడించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement